పేదల స్థలాలపై కన్ను..! | - | Sakshi
Sakshi News home page

పేదల స్థలాలపై కన్ను..!

Sep 19 2025 1:46 AM | Updated on Sep 19 2025 1:46 AM

పేదల స్థలాలపై కన్ను..!

పేదల స్థలాలపై కన్ను..!

కౌకుంట్లలో 206 మందికి

ప్రభుత్వం ప్లాట్ల పంపిణీ

ఆ భూమి మాదంటూ కోర్టును

తప్పుదారి పట్టిస్తున్న కొందరు

న్యాయం కోసం లబ్ధిదారుల

ఎదురుచూపులు

కొన్నేళ్ల క్రితం ప్రభుత్వం పరిహారం చెల్లించి కొందరి నుంచి భూమిని సేకరించింది. అనంతరం ఆ భూమిని ప్లాట్లుగా మార్చి పేదలకు పట్టాలు సైతం పంపిణీ చేసింది. ఇటీవల ఆ ప్లాట్లను ప్రభుత్వం నుంచి పరిహారం పొంది భూమిని విక్రయించిన యజమానుల వారసులు కబ్జా చేశారు. కోర్టును సైతం తప్పుదారి పట్టించి లబ్ధిదారులను ప్లాట్ల వద్దకు రానివ్వకుండా చేస్తుండడంతో.. తమకు న్యాయం చేయాలని దేవరకద్ర నియోజకవర్గంలో నూతనంగా మండలంగా ఏర్పడిన కౌకుంట్లకు చెందిన దాదాపు 206 మంది పేదలు కోరుతున్నారు.

– దేవరకద్ర రూరల్‌

దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్లకు చెందిన 206 మంది ప్లాట్ల యజమానులు తమ న్యాయం చేయా లంటూ కోర్టును, అధికారులను ఆశ్రయించారు. గతంలో పరిహరం చెల్లించి పేదల ప్లాట్ల కోసం ప్రభుత్వం కొనుగోలు చేసిన భూమిని తిరిగి భూమి కి సంబంధించిన యజమాని వారసులు తప్పుడు సమాచారంతో కోర్టును పక్కదారి పట్టించి తిరిగి లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని, పూర్తిస్థాయి విచారణ చేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు. లబ్ధిదారులు తెలిపిన వివరాల ప్రకారం...

1984లో ప్లాట్ల పంపిణీ

1984లో అప్పటి ప్రభుత్వం పేదలకు ప్లాట్లు ఇవ్వా లని నిర్ణయించుకొని కౌకుంట్లలోని సర్వే నెంబర్‌లోని 435, 436లో ఏడుగురిపై ఉన్న 24–35 ఎకరాలకు గాను, 15–84 ఎకరాలను భూమిని సేకరించింది. అనంతరం ఆత్మకూర్‌ తహసీల్దార్‌తో భూమి అక్విజేషన్‌ చేసి అప్పటి విలువ ప్రకారం ప్రభుత్వం రూ.63 వేలను భూ యజామానులకు పరిహరం చెల్లించింది. అనంతరం అదే భూమిలో 12–34 ఎకరాలలో కౌకుంట్లలోని 206 మంది పేదలకు ప్లాట్లు చేసి పట్టాలు సైతం అందజేసింది. పొజిషన్‌ చూపకపోవడంతో వారికి ఇళ్లు మంజూరు కాలేదు. ఈ విషయంపై లబ్ధిదారులు అప్పుడే అధి కారులను కోరినా వారు స్పందించలేదు. ఇదిలాఉండగా ఉమ్మడి అంధ్రప్రదేశ్‌లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం సదరు భూమి విక్రయించిన వారికి పరిహారం అందించింది. అయితే, ఈ సర్వే నంబర్లను గత రెవన్యూ అధికారులు రికార్డులో తొలగించకపోవడంతో గతంలో భూమి విక్రయించిన వారికి సైతం పరిహారం అందింది. దీంతో వారి వారసులు భూమి ఇంకా తమ వారి పేరుపై ఉండటాన్ని గమనించి 2015లో హైకోర్టును అశ్రయించి తమకు అనుకూలంగా తీర్పు తెచ్చుకుని భూమిని సేద్యం చేస్తున్నారు. అక్కడికి వెళ్లిన లబ్ధిదారులకు కోర్టు తీర్పును చూపించి బయటకు పంపించారు. దీంతో లబ్ధిదారులు గతంలో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ తమ దగ్గర ఉన్న ఆధారాలతో ప్రస్తుతం కోర్టును అశ్రయించారు.

మాయమైన అవార్డు కాపీ

భాధితులు కోర్టును అశ్రయించడంతో భూమికి సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని కోర్టు కలెక్టర్‌కు, సంబంధిత అధికారులకు సూ చించింది. కోర్టు ఆదేశాల మేరకు అధారాలు వె తుకుతున్న క్రమంలో 2022 లో దేవరకద్ర తహసీల్ధార్‌ కార్యాలయంలో నాటి ఏడుగురు భూయ జమానులలో ఒకరిపై ఉన్న పైల్‌ నెంఃడి2/ 5256/1983 ప్రకారం 3–70 ఎకరాలకు సంబంధించిన అవార్డు ప్రోసిడింగ్‌ లభించింది. 12–34 ఎకరాల భూమికి సంబంధించిన డి2/ 3006/2984 అవార్డు కాఫీ మాత్రం లభించలే దు. దీనికోసం అధికారులు అప్పటి రిజిష్ట్రేషన్‌ జరిగిన ఆత్మకూర్‌ తహసీల్దార్‌, ఫైల్‌ కాఫీ కోసం జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో వెతికినా కూడా దొరకలేదు. భూసేకరణకు సంబంధించి అన్ని వివరాలు లభించినప్పటికి ఫైల్‌లో కేవలం అవార్డు కాఫీకి సంబంధించిన పేపర్‌ మాయం అవడం గమనార్హం. అప్పట్లో ఇదే శాఖలో పనిచేసిన దేవరకద్ర మండలానికి చెందిన ఓ రెవెన్యూ ఉద్యోగి పాత్ర ఇందులో ఉండవచ్చని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. అధికారులు పూర్తి వివరాలు కోర్టుకు అందించి తమకు న్యాయం చేయాలని లబ్ధిదారులు కొరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement