రైలు ఢీకొని వృద్ధురాలి మృతి | - | Sakshi
Sakshi News home page

రైలు ఢీకొని వృద్ధురాలి మృతి

Sep 19 2025 1:46 AM | Updated on Sep 19 2025 1:46 AM

రైలు ఢీకొని వృద్ధురాలి మృతి

రైలు ఢీకొని వృద్ధురాలి మృతి

గద్వాల క్రైం: రైలు ఢీకొట్టిన ప్రమాదంలో వృద్ధురాలు మృతి చెందినట్లు రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ అశోక్‌కుమార్‌ తెలిపారు. వడ్లవీధికి చెందిన కురువ గోవిందమ్మ(70) మతిస్థిమితం సమస్యతో బాధపడుతుంది. ఈ క్రమంలో గురువారం తెల్లవారు జామున రైల్వేస్టేషన్‌ సమీపంలో రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుమారుడు రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

చికిత్స పొందుతూ యువతి మృతి

ఊట్కూరు:రోడ్డు ప్ర మాదంలో గాయ పడిన యు వతి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. దా మరగిద్ద మండలం సజనాపూర్‌కు చెందిన భార్గవి అలియాస్‌ పవిత్ర(21) ఊ ట్కూరు మండలం మల్లెపల్లికి చెందిన లింగప్పతో 4 నెలల క్రితం వివాహమైంది. ఈ నెల 9న భార్యాభర్తలు శుభకార్యానికి వెళ్తుండగా కొండూరు స్టేజీ సమీపంలో ఆటో బోల్తాపడడంతో భార్గవికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు మక్తల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ గురువారం తెల్ల వారుజామున మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలి తండ్రి హనుమంతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రమేష్‌ తెలిపారు.

చికిత్స పొందుతూ

వ్యక్తి మృతి

అచ్చంపేట రూరల్‌: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ విజయ్‌భాస్కర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బల్మూర్‌ మండలం అంబగిరికి చెందిన అర్జున్‌(35) ఈనెల 11న అమ్రాబాద్‌ మండలానికి వెళ్తుండగా రంగాపూర్‌ వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. గురువారం అతని భార్య అంజలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. అతనికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

కారు ఢీకొని

మహిళ దుర్మరణం

రాజాపూర్‌: కారు ఢీకొని ఓ మహిళ మృతిచెందిన ఘటన గురువారం సాయంత్రం మండల కేంద్రం శివారులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. నర్సింగ్‌తండా గ్రామపంచాయతీ పరిధిలోని ఇబ్రహింపల్లికి చెందిన సంతోష (40) రాజాపూర్‌ శివారులో జాతీయ రహదారి పక్కన జామకాయలు విక్రయించుకుంటూ జీవనం సాగించేది. రోజు మాదిరిగా గురువారం కూడా జామకాయలు విక్రయిస్తుండగా జడ్చర్ల నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న కారు ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 వాహనంలో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. తమ్ముడు యాదయ్య ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ శివానందంగౌడ్‌ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో

వ్యక్తి మృత్యువాత

అడ్డాకుల: మూసాపేట మండల కేంద్రంలోని 44వ నంబర్‌ జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగిన ప్రమాదంలో గుర్తుతెలియని వ్య క్తి దుర్మరణం చెందాడు. స్థానికుల వివరాల ప్ర కారం.. సుమారు 40 ఏళ్లలోపు వయసున్న గుర్తుతెలియని వ్యక్తి మూసాపేట సమీపంలో హైదరాబాద్‌వైపు నుంచి కర్నూల్‌ వైపు వెళ్లే రోడ్డును దాటుతుండగా.. గుర్తుతెలియని వా హనం ఢీకొట్టింది. ప్రమాదంలో అతడికి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. నడిరోడ్డుపై మృతదేహం పడిపోవడంతో కర్నూలు రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని మార్చురీకి తరలించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. దీనిపై విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎం.వేణు తెలిపారు.

విద్యుదాఘాతంతో

కార్మికుడి మృతి

గోపాల్‌పేట: విద్యాదాఘాతంలో పంచాయతీ కార్మికుడు మృతి చెందిన ఘటన రేవల్లి మండల కేంద్రంలో గురువారం జరిగింది. ఎస్‌ఐ రజిత తెలిపిన వివరాలు.. రేవల్లి మండల కేంద్రానికి చెందిన టప్ప సత్యం(58) పంచాయతీ కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఉదయం ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. గ్రామ సమీపంలోని ఎల్లయ్య పొలంలో పందుల కోసం కోసం పెట్టిన కరెంటు వైర్లు చుట్టుకొని పడి ఉన్నట్లు గుర్తించిన స్థానికులు సత్యం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు, పోలీసులు సత్యం మృతి చెంది ఉండటాన్ని గుర్తించారు. మృతుడి భార్య నర్సమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement