
గంజాయి సాగుచేసిన వ్యక్తికి రిమాండ్
గట్టు: మండలంలోని బోయలగూడెం గ్రామ శివారులో గంజాయి సాగుచేసిన వ్యక్తిని పోలీసులు అరె స్టుచేసి రిమాండ్‌కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం గద్వాల పోలీసు సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో సీఐ శ్రీను, ఎస్‌ఐ మల్లేశ్ వెల్లడించారు. అయిజ మండలం తోత్తినోనిదొడ్డి గ్రామానికి చెందిన బస్వాపురం ప్రాణేశ్ బోయలగూడెం శివారులోని సర్వే నంబర్ 382/1లో కౌలుకు తీసుకున్న పొలంలో మిరప, పత్తిపంట సాగుచేశాడు. ఈ పంటల మధ్య 9 గంజాయి మొక్కలను పెంచాడు. 5నుంచి 6 ఫీట్ల ఎత్తులో ఒక్కొక్కటి 3 కేజీలు ఉన్న గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.