
ప్రజావాణికి 71 ఫిర్యాదులు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ప్రజావాణికి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. ప్రజావాణిలో భాగంగా సోమవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో 71 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి దరఖాస్తును నిర్లక్ష్యం చేయకుండా సంబంధిత అధికారులు జాగ్రత్తగా పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, నర్సింహారెడ్డి, జెడ్పీసీఈఓ వెంకట్‌రెడ్డి, ఆర్డీఓ నవీన్, డీఆర్‌డీఓ నర్సింహులు, అర్బన్ తహసీల్దార్ ఘన్సీరాం తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 13..
మహబూబ్‌నగర్ క్రైం: ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి దరఖాస్తును శ్రద్ధగా పరిశీలించి, అధికారులతో నేరుగా మాట్లాడుతూ పరిష్కార చర్యలు తీసుకోవాలని ఎస్పీ జానకి అన్నారు. ఎస్పీ కార్యాలయంలో సోమవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 13 మంది నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన ఆమె ఆయా పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడుతూ కేసులు నమోదు చేయడంతోపాటు సకాలంలో పరిష్కారం చూపాలని ఆదేశించారు.