
నగరంలో రోడ్లమరమ్మతు ప్రారంభం
● ‘సాక్షి’ కథనానికి స్పందించిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు
● బాగా దెబ్బతిన్న చోట సీసీ పనులు, మిగతా ప్రాంతాల్లో వెట్‌మిక్స్
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లా కేంద్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రోడ్లు అధ్వాన స్థితికి చేరుకున్నాయి. ఈ విషయమై ఈనెల 1న ‘సాక్షి’లో ‘‘దారి’ద్య్రం’’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీనికి స్పందించిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెంటనే ఈ రోడ్లకు మరమ్మతు పనులు ఆరంభించారు. ముఖ్యంగా క్లాక్‌టవర్ చుట్టూ, కోస్గి రోడ్డులో సీసీ పనులు చేపడుతున్నారు. మిగతా ప్రాంతాలలో వెట్‌మిక్స్‌తో గుంతలను పూడ్చివేస్తున్నారు. అయితే వీధుల్లోని రోడ్లకు అడ్డంగా అప్పట్లో మిషన్ భగీరథ పథకం కోసం తవ్విన గుంతలను మాత్రం బాగు చేయకపోవడం గమనార్హం.

నగరంలో రోడ్లమరమ్మతు ప్రారంభం