
కేఎల్‌ఐ కాల్వలో మోటార్లు చోరీ
మిడ్జిల్: మండలంలోని వాడ్యాల్ శివారు కేఎల్‌ఐ కాల్వలో రైతులు అమర్చిన మోటార్లను శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు 4 మోటార్లు ఎత్తుకెళ్లారు. మరికొన్ని మోటార్ల కేబుల్ వైరు చోరీ చేసి తీసుకెళ్లారు. మరికొన్ని మోటార్లను విప్పి అందులోని రాగి వైరు పట్టకెళ్లారు. రైతులు మోటార్లు చోరీ కావడంతో లబోదిబోమని మొత్తుకుంటున్నారు. ఏటా ఇలా చోరీలు జరుగడంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు తెలిపారు. ఘటనపై పోలీసులకు కూడా ఇప్పుడు, గతంలో ఫిర్యాదు చేసిన్నట్లు రైతులు తెలిపారు. మోటార్ల దొంగలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఇసుక ట్రాక్టర్ పట్టివేత
ఊట్కూరు: మండలంలోని తిప్పరాస్‌పల్లి గ్రా మ శివారులో శనివారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను పట్టుకొని కేసు న మోదు చేసినట్లు ఆదివారం ఎస్‌ఐ రమేష్ తెలిపారు. హనుమంతు గ్రామ శివారులో ట్రాక్టర్‌లో ఇసుకను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.