
రైతుల దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టొద్దు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): విద్యుత్ కనెక్షన్ల కోసం రైతులు పెట్టుకున్న దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టుకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని విద్యుత్ కార్పొరేట్ కమర్షియల్ డైరెక్టర్ చక్రపాణి అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని విద్యుత్ భవన్‌లోని మీటింగ్ హాల్‌లో విద్యుత్ అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు చెందిన కనెక్షన్లను త్వరితగతిన మంజూరు చేయాలని, వాటికి సంబంధించిన విద్యుత్ సామగ్రిని వెంటనే అందజేయాలని సూచించారు. కొత్త కనెక్షన్లను నిర్ధిష్ట సమయంలోగా మంజూరు చేయాలన్నారు. విద్యుత్ వినియోగదారుల సమస్యలను పెండింగ్ పెట్టకుండా వెంటనే పరిష్కరించాలన్నారు. విద్యుత్ బకాయిలను వెంటనే వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతినెలా క్రమం తప్పకుండా విద్యుత్ బిల్లులు వసూలు చేయాలన్నారు. కార్యక్రమంలో విద్యుత్ కమర్షియల్ సీఈ భిక్షపతి, ఎస్‌ఈ రమేష్, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.
కార్యాలయాలను
శుభ్రంగా ఉంచుకోవాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ ఆవరణను ఆయన పరిశీలించారు. ఈవీఎం గోదాం, హెలీప్యాడ్ వద్ద ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలను జేసీబీతో తొలగించే కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. దగ్గర ఉండి పని చేయించారు. ప్రభుత్వ కార్యాలయ ఆవరణ మాత్రమే కాకుండా సెక్షన్లను సైతం పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఎక్కడ పడితే అక్కడ చెత్తను వేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉద్యోగులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
పెంట్లవెల్లి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 18న కొల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ జూపల్లి కృష్ణారావు అధికారులకు సూచించారు. మంగళవారం పెంట్లవెల్లి మండలం జటప్రోల్‌లో కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఇతర అధికారులతో కలిసి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారిగా కొల్లాపూర్ నియోజకవర్గానికి వస్తున్నారన్నారు. జటప్రోల్‌లో రూ. 150కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేసిన అనంతరం సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే విధంగా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అత్యంత పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం హెలీపా్‌య్డ్, సభా స్థలాన్ని మంత్రి పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్, ఆర్డీఓ భన్సీలాల్ పాల్గొన్నారు. కాగా, జటప్రోల్ సమీపంలో నిర్మించే ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణానికి కేటాయించిన 16.06 ఎకరాల భూమి గోప్లాపూర్ శివారుకు చెందినదని.. కొత్తగా నిర్మించే పాఠశాలకు తమ గ్రామం పేరు పెట్టాలని కోరుతూ గ్రామస్తులు అధికారులకు వినతిపత్రం అందజేశారు.

రైతుల దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టొద్దు