
ప్రైవేటు స్కూల్ బస్సు బ్రేకులు ఫెయిల్
అయిజ: పట్టణంలోని నవభారత్ స్కూల్‌కు చెందిన బస్సు బ్రేకులు ఫెయిలై ద్విచక్ర వాహనాల పైకి దూసుకెళ్లింది. స్థానికులు తెలిపిన వివరాలు.. సోమవారం పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో రాంగ్ రూట్‌లో వెళ్తున్న నవభారత్ స్కూల్ బస్సు మరో స్కూల్ బస్సును ఢీకొనే క్రమంలో బస్సును రోడ్డు పక్కకు మళ్లించాడు. ఈ క్రమంలో బస్సు బైక్ పైకి దూసుకెళ్లింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి చాకచక్యంగా బైక్ పైనుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఫిట్‌నెస్ లేని బస్సులు అతివేగంగా వెళ్లడం, రాంగ్ రూట్‌లో బస్సులు నడపడంతో పట్టణంలో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని పట్టణ ప్రజలు వాపోతున్నారు.