
రిజిస్ట్రేషన్.. ఫ్రస్టేషన్
ఉన్నతాధికారుల
వైఖరే కారణమా?
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ రాష్ట్ర ఉన్నతాధికారుల ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నట్లు కనిపిస్తుంది. ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో సిబ్బంది కొరత వేధిస్తున్నా.. పట్టనట్లుగా ఉంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికై నా దృష్టిసారించి ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉద్యోగులను భర్తీ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ విషయమై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఉన్నతాధికారి డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్(డీఐజీ)ను ఫోన్‌లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.
మెట్టుగడ్డ: రాష్ట్రంలో ఆదాయాన్ని ఎక్కువగా ఆర్జించే శాఖల్లో అతి ముఖ్యమైన విభాగం రిజిస్ట్రేషన్, స్టాంపుల విభాగం. ఆస్తులకు రిజిస్టర్డ్ పత్రాల ద్వారా హక్కు కల్పించి రక్షించడం ఈశాఖ యొక్క లక్ష్యం. స్టాంపు డ్యూటీ, ట్రాన్స్‌ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులతో ఈశాఖ రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని సేకరిస్తుంది. ఉమ్మడి జిల్లాలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిస్థితి దయనీయంగా మారింది. ఇప్పటికీ అనేక కార్యాలయాలు అద్దె భవనాలు, అరకొర వసతులతో కొనసాగుతున్నాయి. మరోపక్క ఉద్యోగుల కొరత, ఉన్నవారిపై పనిభారంతో కావాల్సిన పనులు సకాలంలో జరగడంలేదని ప్రజలు వాపోతున్నారు.
డిప్యూటేషన్లు, ఇన్‌చార్జీలుగా..
ఉమ్మడి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్(జిల్లా రిజిస్ట్రార్) కార్యాలయంలో పనిచేయాల్సిన ఉద్యోగులు ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్‌లుగా, డిప్యూటేషన్‌పై వెళ్లడంతో ఖాళీగా దర్శనమిస్తుంది. కేవలం ముగ్గురు ఉద్యోగులతో కార్యాలయం కొనసాగుతుంది. కేవలం జూనియర్ అసిస్టెంట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం పరిపాలన విభాగం నడుస్తుంది. ఉమ్మడి జిల్లాలోని సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో సీనియర్ అసిస్టెంట్ లే(ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్)గా విధులు నిర్వహించాల్సి దుస్తితి నెలకొంది.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం
ఆదాయం చేకూర్చేవిగా పేరు
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ప్రభుత్వానికి అధిక ఆదాయం సమకూర్చేవిగా పేరొందాయి. ఇలాంటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. అందులో కొన్ని కార్యాలయాలు ఇన్‌చార్జీలతో నడుస్తున్నాయి. విధులు నిర్వహించాల్సిన అధికారు లు డిప్యూటేషన్ పేరుతో వెళ్లిపోతున్నారు. ఇలా వెళ్లిన దగ్గర సీనియర్ అసిస్టెంట్‌తో భర్తీ చేస్తున్నారు. వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
సమస్యల వలయంలో రిజిస్ట్రార్ కార్యాలయం
రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్‌ల కుర్చీలు ఖాళీగా దర్శనం
కొట్టుమిట్టాడుతున్న ఆదాయాన్నిచ్చే శాఖ
అద్దె భవనాలు, అరకొర వసతులతో ఇక్కట్లు
పనిభారంతో ఒత్తిడికి లోనవుతున్న ఉద్యోగులు
ఇన్‌చార్జీలు, డిప్యూటేషన్‌పై నడుస్తున్న వైనం
ఇన్‌చార్జీల పాలనపై విసుగు చెందుతున్న ప్రజలు

రిజిస్ట్రేషన్.. ఫ్రస్టేషన్