
ఉన్నతస్థాయి శిక్షణకు వేదిక
మెయిన్ స్టేడియంలోని వాలీబాల్ అకాడమీ
మహబూబ్‌నగర్ క్రీడలు: రాష్ట్ర క్రీడా సాధికారిక సంస్థ 2004లో జిల్లాకు వాలీబాల్ అకాడమీ మంజూరు చేయగా నాలుగేళ్లలో జిల్లా క్రీడాకారులు అనేక మంది శిక్షణ పొందారు. నిధుల నిర్వహణ భారంతో 2008 సంవత్సరంలో వాలీబాల్ అకాడమీని మూసేశారు. వాలీబాల్ అకాడమీలో శిక్షణ పొందిన జిల్లా క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారులుగా రాణించారు. మెయిన్ స్టేడియంలో వాలీబాల్ అకాడమీని తిరిగి ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉండగా.. మూడేళ్ల క్రితం తిరిగి పునఃప్రారంభించారు. రూ.19.70లక్షలతో వాలీబాల్ అకాడమీ ఏర్పాటు చేశారు. స్టేడియం ఆవరణలోగల స్విమ్మింగ్‌పూల్‌లోని అంతస్తుల గదులకు మరమ్మతు పనులు చేపట్టారు. రెండు పాత వాలీబాల్ కోర్టులను ఆధునీకరించి వాటి స్థానంలో నూతన కోర్టులు ఏర్పాటు చేశారు. క్రీడాకారుల వసతి సామగ్రి ఇప్పటికే అకాడమీకి చేరాయి. స్విమ్మింగ్‌పూల్ అంతస్తులో బాలురకు, ఇండోర్ స్టేడియంలో బాలికలకు వసతి ఏర్పాటు చేశారు.
మెరుగైన శిక్షణ
వాలీబాల్ అకాడమీలో ఎంపికై న బాల, బాలికలకు ఇద్దరు లేదా ముగ్గురు కోచ్‌ల పర్యవేక్షణలో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. దాదాపు రెండు నెలలపాటు వాలీబాల్ బేసిక్ శిక్షణ ఇచ్చి, వారిలో అటాకర్, షూటర్, బ్లాకర్, లిబిరో స్థానాల్లో ఆడేవారిని గుర్తిస్తారు. అకాడమీలో శిక్షణ పొందే క్రీడాకారులను రాష్ట్ర, జాతీయస్థాయి టోర్నీల్లో ఆడేలా తీర్చిదిద్దుతారు.
ఎంపికై న క్రీడాకారులు
బాలురు.. బోయ చందు (జోగులాంబ గద్వాల), జి.వరుణ్‌కుమార్ (రంగారెడ్డి), రాత్లావత్ రఘువీర్ (నాగర్‌కర్నూల్), చెన్నదీక్షిత్ (మహబూబ్‌నగర్), గోగురి వరుణ్‌సాయి (జగిత్యాల), పి.ప్రశాంత్ (మహబూబ్‌నగర్), వి.మదన్‌రాజ్‌గౌడ్ (వనపర్తి), ఆత్రం శంకర్ (ఆదిలాబాద్), దులకడి నరేష్ (వికారాబాద్), సున్‌కసరి జ్ఞానేశ్వర్ (మహబూబ్‌నగర్), ఎస్.గణేష్ (రంగారెడ్డి), మహ్మద్ ముఖిద్ (షాద్‌నగర్), డి.కుషల్‌కుమార్, సత్తు అరుణ్‌కుమార్ (రంగారెడ్డి), జశ్వంత్ (సిద్దిపేట)
బాలికలు..
సీహెచ్ శరణ్య, ఎన్ శ్రీలేఖ, టి ప్రియాంక, డి కావ్య (వనపర్తి), వి సాయికీర్తన (రంగారెడ్డి), ఎం సమత (నారాయణపేట), సబావత్ స్వాతి, బి అమృత, టి బిందు మాధవి (వనపర్తి), జొరాల హరిక, ఎ.స్వాతి (మహబూబ్‌నగర్), టినిటి వైష్ణవి (నారాయణపేట), గుంటి మైత్రి (నాగర్‌కర్నూల్), బి.శిరీష (వనపర్తి), ఆర్.దివ్య (మహబూబ్‌నగర్), బైకని స్పందన (వికారాబాద్), కె.మౌనిక (మహబూబ్‌నగర్)
15 మంది బాలురు, 17 మంది బాలికల ఎంపిక
ఉదయం, సాయంత్రం వేళల్లో క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ
రూ.19.70లక్షలతో వసతుల ఏర్పాటు