
612 కిలోల నల్లబెల్లం పట్టివేత
అచ్చంపేట రూరల్: అక్రమంగా నల్లబెల్లం సరఫరా చేస్తున్న ఓ వ్యక్తిని ఎకై ్సజ్ పోలీసులు పట్టుకున్నారు. ఎకై ్సజ్ సీఐ కృష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం పట్టణ శివారులో ఎకై ్సజ్ సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా.. మహీంద్రా జైలో వాహనంలో నల్లబెల్లాన్ని గుర్తించామన్నారు. దీంతో అచ్చంపేట పట్టణానికి చెందిన పోల కుసుమశెట్టిని అదుపులోకి తీసుకుని వాహనంలో ఉన్న 612 కిలోల నల్లబెల్లం, 25 కిలోల పటికను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని అచ్చంపేట తహసీల్దార్ ఎదుట రూ.5లక్షలకు బైండోవర్ చేశామని తెలిపారు. అక్రమంగా నల్లబెల్లం సరఫరా చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.