తీరొక్క పంటలు | - | Sakshi
Sakshi News home page

తీరొక్క పంటలు

Mar 7 2025 12:39 AM | Updated on Mar 7 2025 12:39 AM

తీరొక

తీరొక్క పంటలు

కృష్ణానదిలో
మినుములు, నువ్వులు, వేరుశనగ పంటల సాగు

కృష్ణా నదీతీరంలో నల్లరేగడి భూమి

ఎరువులు వాడం

ఈ పొలాల్లో ఎరువులు వాడుకుండానే పంటలు సాగుచేస్తాం. తేమ నీళ్లకు వివిధ రకాల పంటలు పండిస్తాం. అధిక దిగుబడులు వస్తాయి. – శివ, రైతు, మంచాలకట్ట

మంచి దిగుబడులు

ప్రతి యేడు కాలానికి తగినట్లుగా రకరకాల పంటలు వేస్తూ సరైన మోతాదులో ఎరువులు వాడుకొని పంటలు సాగు చేస్తా. ఇతర పొలాల కంటే ఈ నల్లరేగడి పొలాల్లో మంచి దిగుబడులు వస్తాయి. – శేఖర్‌, మల్లేశ్వరం

మినుములు, నువ్వులు

పండిస్తా

ప్రతి సంవత్సరం జటప్రోల్‌ గ్రామ శివారులో 10 ఎకరాల్లో మినుములు, నువ్వుల పంట పండిస్తా. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి పంటలు పండించి లాభాలు పొందుతున్నా. – భీంరెడ్డి, జటప్రోల్‌

తక్కువ ఖర్చుతో..

నల్లరేగడి పొలాలు కనుక ఎకరాకు నువ్వుల పంట 6 క్వింటాళ్లు, మినుములు 10 నుంచి 12 క్వింటాళ్ల వరకు దిగుబడులు వస్తాయి. అతి తక్కువ ఖర్చుతో ఈ పంటలను పండిస్తాం. – బాలరాజు, రైతు

పెంట్లవెల్లి: ప్రతి యేటా కృష్ణానదిలో నీరు తగ్గే కొద్ది తీరొక్క పంటలను రైతులు సాగు చేస్తారు. కృష్ణా నదీతీరాన ఉన్న ఒండ్రుమట్టిలో నది ఎండిన తర్వాత నాణ్యమైన రకరకాల పంటలను పండిస్తుంటారు. శ్రీశైలం ప్రాజెక్ట్‌ కట్టినప్పుడు ప్రాజెక్ట్‌ బ్యాక్‌వాటర్‌లో దాదాపు 2000 ఎకరాల వరకు నల్లమట్టితో కూడిన ఒండ్రు మట్టి పొలాలు ఉండేవి. పెంట్లవెల్లి మండలంలోని మంచాలకట్ట, జటప్రోల్‌, చెల్లపాడు, మాధవస్వామినగర్‌, మల్లేశ్వరం, సోమశిల, అమరగిరి వాసులు కృష్ణానదిలో పొలాలున్న రైతుల దగ్గర కౌలురైతులు కౌలుకు తీసుకొని నీరు తీస్తుండేకొద్ది సాగు చేస్తూ తీరొక్క పంటలను సాగు చేస్తున్నారు. ఈ పంటలు నాణ్యతతో పాటు అధిక దిగుబడులు ఇచ్చేవి. ముఖ్యంగా మినుములు, నువ్వులు, వేరుశనగ, మొక్కజొన్న, శనగ, పొద్దుతిరుగుడు పంటలను అధికంగా సాగుచేస్తారు. వివిధ గ్రామాల రైతులు 1500 నుంచి 2000 ఎకరాల వరకు పంట సాగు అవుతున్నాయి.

రూ.10వేల నుంచి రూ.15వేలు కౌలు పెట్టి..

ఈ పొలాలు కృష్ణానది నీటిలో దాదాపు ఆరు నెలలపాటు మునిగి ఉంటాయి. అందులో పదును, తేమతో ఎక్కువగా పంటలు పండుతాయి. దీంతో నీరు పెట్టడం తక్కువ మోతాదులోనే ఉంటుంది. ఎరువులు కూడా తక్కువగానే వాడుతుంటారు. ఎకరాకు రూ.10వేల నుంచి రూ.15వేలు కౌలునకు తీసుకొని మరీ ఈ పొలాలను సాగుచేయడానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు. మంచాలకట్ట, మల్లేశ్వరం, జటప్రోల్‌ గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు చేపలు పట్టడంతో పాటు పంటలు కూడా సాగు చేస్తారు.

శ్రీశైలం ప్రాజెక్ట్‌

కట్టినప్పుడు దాదాపు వేల ఎకరాలు

ముంపునకు గురయ్యాయి. కొల్లాపూర్‌ నియోజకవర్గంలోని కృష్ణానదీ పరివాహక ప్రాంతాల కొన్ని గ్రామాల ప్రజలు కృష్ణానదికి దగ్గర్లో నూతనంగా గ్రామాలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి సంవత్సరం కృష్ణానదిలో ఈభూములు మునకకు గురైన తర్వాత మళ్లీ నీరు తీశాక అక్కడే ఉన్న కొంతమంది రైతులు భూములను వ్యవసాయం చేసుకుంటారు. మరికొందరు మునకకు గురైనప్పుడు ఆ గ్రామాలు వదిలిపెట్టి ఇతర ప్రాంతాలకు వెళ్లినవారి భూములను అక్కడే ఉన్న రైతులు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తుంటారు.

నాణ్యతతో పాటు అధిక దిగబడులు

1500 నుంచి 2000 ఎకరాల్లో

పంట పొలాలు

తీరొక్క పంటలు 1
1/6

తీరొక్క పంటలు

తీరొక్క పంటలు 2
2/6

తీరొక్క పంటలు

తీరొక్క పంటలు 3
3/6

తీరొక్క పంటలు

తీరొక్క పంటలు 4
4/6

తీరొక్క పంటలు

తీరొక్క పంటలు 5
5/6

తీరొక్క పంటలు

తీరొక్క పంటలు 6
6/6

తీరొక్క పంటలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement