
కాపురానికి సహకరించడం లేదని.. కట్టుకున్న భార్యను కడతేర్చ
మద్దూరు: కొత్తపల్లి మండలం ఎక్కమేడ్ గ్రామంలో నవవధువు అనుమానస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. కాపురానికి సహకరించడం లేదని కట్టుకున్న భర్తే నవవధువును హతమార్చాడు. అతడిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను నారాయణపేట డీఎస్పీ ఎన్.లింగయ్య వెల్లడించారు. వివరాలిలా.. కొత్తపల్లి మండలం ఎక్కమేడ్‌కు చెందిన కడపని స్వామితో కొయిల్‌కొండ మండలం మల్కాపూర్‌కు చెందిన పూజ(19)తో గతనెల 20న వివాహం జరిగింది. పెళ్లయిన తర్వాత తల్లిగారింటికి వెళ్లిన పూజ.. అక్కడే 10 రోజులపాటు ఉండి, ఈ నెల 14న అత్తగారింటికి వచ్చింది. 18న రాత్రి భర్త కడపని స్వామి పూజతో శారీరకంగా కలవడానికి ప్రయత్నించగా.. ఆమె నిరాకరించింది. తల్లిగారింటి నుంచి వచ్చినప్పటి నుంచి తనతో కలవడానికి నిరాకరిస్తుందని.. ఆమెకు మరొకరితో వివాహేతర సంబంధం ఉందేమోనని అనుమానం పెంచుకున్నాడు. తనతో ఉంటే ఇక సుఖం ఉండదని.. ఆమెను చంపి మరొకరిని వివాహం చేసుకోవాలని భావించాడు. ఈ క్రమంలో అదే రోజు రాత్రి పూజ గొంతు నుమిలి హతమార్చాడు. మృతురాలి తండ్రి గుర్రాల కుశలయ్య ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. మృతదేహానికి మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అయితే డాక్టర్ ఇచ్చిన నివేదిక ప్రకారం కేసును హత్యానేరం కింద మార్చి.. కోస్గి సీఐ సైదులు, మద్దూరు ఎస్‌ఐ విజయ్‌కుమార్ నేతృత్వంలో విచారణ చేపట్టారు. కడపని స్వామిని పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో చేసిన నేరాన్ని ఒప్పుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.
నవవధువు మృతి కేసును ఛేదించిన పోలీసులు
వివరాలు వెల్లడించిన డీఎస్పీ ఎన్.లింగయ్య