
చిరుత దాడిలో లేగదూడ హతం
కోయిల్‌కొండ: లేగదూడపై చిరుత దాడిచేసి హతమార్చిన ఘటన కోయిల్‌కొండ మండలం ఇబ్రహీంనగర్ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. ఇబ్రహీంనగర్‌కు చెందిన రైతు బోయిని ఆనంద్ గ్రామ సమీపంలోని కుక్కలగుట్ట వద్దనున్న తన పొలంలో రోజు మాదిరిగానే బుధవారం రాత్రి పశువులను కట్టేసి ఇంటికి వచ్చాడు. అర్ధరాత్రి సమయంలో పశువుల పాకపై చిరుత దాడిచేసి ఓ లేగదూడను ఎత్తుకెళ్లి హతమార్చింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. బాధిత రైతును ప్రభుత్వపరంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.