
కొన్ని నెలలుగా టీఆర్టీ కోసం సిద్ధమవుతు న్నాం. కానీ ప్రభుత్వం గతంలో ప్రకటించిన పోస్టుల కన్నా తక్కువ పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చింది. ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. ఎంతో కాలంగా ఆశగా చదువుతున్నాం. ప్రభు త్వం దీన్ని దృష్టిలో ఉంచుకుని పోస్టులు పెంచితే బాగుంటుంది. – అనూష, టీఆర్టీ అభ్యర్థి
తక్కువ పోస్టులతో ఇబ్బంది
వాస్తవంగా బడుల్లో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేస్తే పోస్టుల సంఖ్య పెరుగుతుంది. కానీ తక్కువ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే వీటిలో ఒక్కో పోస్టుకు వందల సంఖ్యలో పోటీ పడాల్సి వస్తోంది. కేటగిరిలు, సబ్జెక్టు వారీగా చూస్తే కొన్ని సున్నా పోస్టులు ఉన్నాయి. ఎంతో ఖర్చులు భర్తిస్తూ చదువుతున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే పోస్టులను పెంచాలి.
– మేఘమాల, టీఆర్టీ అభ్యర్థి
ఫీజు తగ్గించి..
ప్రభుత్వం ప్రస్తుతం త క్కువ పోస్టులతో మినీ డీఎస్సీ వేసింది. అసెంబ్లీలో ప్రకటించిన విధంగా పోస్టుల సంఖ్య పెంచి మెగా డీఎస్సీని నిర్వహించాలి. ఏళ్ల తరబడి పోటీ పరీక్షలకు రూ. లక్షల్లో ఖర్చులు భరించి చదువుతున్నాం. ప్రభుత్వం స్పందించి పోస్టులు పెంచాలి. అలా గే పరీక్ష ఫీజు కూడా రూ.200కి తగ్గించాలి.
– కేశవులు, టీఆర్టీ అభ్యర్థి
●

