వీరుల త్యాగాలు విస్మరించొద్దు | - | Sakshi
Sakshi News home page

వీరుల త్యాగాలు విస్మరించొద్దు

Sep 17 2026 1:26 AM | Updated on Sep 17 2026 1:26 AM

తెలంగాణ సాయుధ పోరాట అమరుల జ్ఞాపకార్థం గ్రామంలో స్ఫూర్తి చిహ్నం ఏర్పాటు చేయాలి. తెలంగాణ సాయుధ పోరాటం, గ్రామంలో రజాకార్ల అరాచకాలు, 21మంది అమరుల త్యాగాలు భావితరాలకు తెలియాల్సిన అవసరం ఉంది. 21 మంది చంపిన ప్రదేశంలో ప్రభుత్వం స్మృతి చిహ్నం ఏర్పాటు చేయాలి.

– శెట్టి వెంకన్న,

సీపీఎం జిల్లా నాయకుడు, పెరుమాళ్లసంకీస

త్యాగాలతోనే ఈ ప్రాంతం విముక్తి..

రజాకార్లకు వ్యతిరేకంగా ప్రాణాలు అర్పించిన గడ్డ ఇది. తెలంగాణ విమోచన పోరాటంలో రజాకార్లకు వ్యతిరేకంగా మా బయ్యారం ప్రాంతవాసులు ఎంతోమంది తమ ప్రాణాలను అర్పించారు. వారి ప్రాణ త్యాగాలకు ఫలితంగా విముక్తి పొందిన తెలంగాణలో మొదటి అమరవీరుల స్తూపం బయ్యారంలోనే నిర్మించారు.

– నందగిరి వెంకటేశ్వర్లు, వెంకట్రాంపురం, బయ్యారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement