16 రకాల నిత్యావసరాలు అందించాలి | - | Sakshi
Sakshi News home page

16 రకాల నిత్యావసరాలు అందించాలి

Aug 3 2026 1:07 AM | Updated on Aug 3 2026 1:07 AM

నెహ్రూసెంటర్‌: ప్రజాపంపిణీ వ్యవస్థను మెరుగుపరిచి, కేరళ తరహాలో 16 రకాల నిత్యవసరాలను అందించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.నాగయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేషన్‌ దుకాణాల ద్వారా బియ్యం తప్ప ఎలాంటి సరుకులు అందజేయడం లేదని, ప్రజల అవసరాలకు అనగుణంగా పంపిణీ చేసే సరుకుల సంఖ్య పెంచాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 10న నిర్వహించనున్న జైల్‌భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సాదుల శ్రీనివాస్‌, అల్వాల వీరయ్య, ఎండీ.యాకూబ్‌, వంగూరు వెంకటేశ్వర్లు, బాణాల రాజన్న, గోడిశాల వెంకన్న, కుంట ఉపేందర్‌, పాల్వాయి దుర్గయ్య, ఆనంద్‌రావు, కుంట రామకృష్ణ, బండి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

మహబూబాబాద్‌ అర్బన్‌: సెప్టెంబర్‌ 5న గురుపూజోత్సవం పురస్కరించుకొని రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక కోసం అర్హులైన ప్రభుత్వ పాఠశాల, కేజీబీవీ, మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణమూర్తి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సంబంధిత మండల విద్యాశాఖ అధికారులకు ఈ నెల 6వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించాలని, ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులందరు, ఉపాధ్యాయుల ప్రతినిధులు ఈ నెల 7వ తేదీ సాయత్రం 5గంటల వరకు జిల్లా వి ద్యాశాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు.

పోలీస్‌ శిక్షణ ప్రవేశ పరీక్ష ప్రశాంతం

మహబూబాబాద్‌ అర్భన్‌: జిల్లా కేంద్రంలో పోలీస్‌ కానిస్టేబుల్‌, ఎస్సై ఉచిత శిక్షణ ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. జిల్లా కేంద్రంలోని మహర్షి విద్యాలయం, శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌, శ్రీ చైతన్య హైస్కూల్‌, తొర్రూరులోని సమత డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన నాలుగు పరీక్ష కేంద్రాల్లో 1,058 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద జిల్లా పోలీస్‌ శాఖ అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టడంతో పరీక్ష ప్రశాంతంగా వాతావరణంలో సజావుగా ముగిసింది. అభ్యర్థులకు అవసరమైన సూచనలు అందించడంతో పాటు రవాణా సౌకర్యం అవసరమైన వారికి సంబంధిత పోలీస్‌ స్టేషన్ల ద్వారా వాహన సౌకర్యం కల్పించారు. పోలీస్‌ అధికారులు, సిబ్బంది సమన్వయంతో వ్యవహరించి పరీక్షను విజయవంతంగా నిర్వహించారు. జిల్లా పోలీస్‌ శాఖ నిరుద్యోగ యువతకు ఉచితంగా కోచింగ్‌ అందించడంతో పోలీస్‌ ఉద్యోగాల సాధనకు తోడ్పడడం ఆనందంగా ఉందన్నారు. ఎంపికై న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో శిక్షణ పొంది పోలీస్‌ ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు.

డోర్నకల్‌ డయోసీస్‌

బిషప్‌గా సేనంరాజు

డోర్నకల్‌: ప్రతిష్టాత్మక చర్చి ఆఫ్‌ సౌత్‌ ఇండియా డోర్నకల్‌ డయోసీస్‌ 10వ బిషప్‌గా రెవ సేనంరాజు నియమితులయ్యారు. స్థానిక ఎఫిఫనీ చర్చిలో ఆదివారం డయోసీస్‌ బిషప్‌గా సేనంరాజు పట్టాభిషేకం వైభవంగా జరిగింది. ఎఫిఫనీ చర్చిలో సీఎస్‌ఐ మోడరేటర్‌, కరీనగర్‌ బిషప్‌ రూబెన్‌ మార్క్‌ సేనంరాజుతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం బిషప్‌గా సేనంరాజు పట్టాభిషక్తుడయ్యారు. అనంతరం ఎఫిఫనీ చర్చి ఆవరణలో జరిగిన సన్మానభలో బిషప్‌ సేనంరాజు, విజయసేనంరాజు దంపతులను సీఎస్‌ఐ మోడరేటర్‌ రూబెన్‌ మార్క్‌ సన్మానించారు. ఈ సందర్భంగా సేనంరాజు మాట్లాడుతూ.. డోర్నకల్‌ డయోసీస్‌ పరిధిలో అవినీతి రహిత పాలన కొనసాగిస్తామని తెలిపారు. నియామకాలు, బదిలీలు, ఇతర విషయాల్లో ఎలాంటి అవినీతి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. అందరి సహకారంతో డోర్నకల్‌ డయోసీస్‌ను అభివృద్ధి చేస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement