కేయూక్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఇంజనీరింగ్ విభాగాల్లో నలుగురు అధిపతులను నియమించారు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగం అధిపతిగా ఆ విభాగం ప్రొఫెసర్ ఎం సదానందం, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం అధిపతిగా ఆ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాధిక, ఎలక్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ (ఈసీఈ) విభాగం అధిపతిగా ఆ విభాగం డాక్టర్ బి. శ్రీకాంత్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (ఈఈఈ ) విభాగం అధిపతిగా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె. సుమలత నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం ఉత్తర్వులు జారీచేశారు. కాగా, వీరు రెండు సంవత్సరాలపాటు ఆ పదవుల్లో ఉంటారు. ఈ నలుగురికి సోమవారం సాయంత్రం కేయూ వీసీ కె. ప్రతాప్ రెడ్డి ఉత్తర్వుల కాపీలు అందజేశారు.


