కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు
స్పందించాలి..
కాజీపేట : కాజీపేట మండలం కడిపికొండ గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ కొండపర్తి మనోహర్ రావు కుమారుడు సు రేందర్ రావు ప్రస్తుతం అ త్యంత దయనీయ పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తున్నారు. భార్య, పిల్ల లు ఎవరూ లేక ఒంటరిగా జీవిస్తున్న ఆయనకు ఆహారం కూడా కరువై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తొలితరం ఎమ్మెల్సీగా ప్రజాసేవలో గుర్తింపు పొందిన మనోహర్ రావు భూస్వామ్య కుటుంబానికి చెందిన వారు. అడిగిన వారికి లేదనకుండా భూములతోపాటు ఆర్థిక సాయం అందించారు. ప్రస్తుతం కాజీపేట రైల్వే జంక్షన్‌తో పాటు పరిసర ప్రాంతాల్లోని విస్తార భూములు ఒకప్పుడు వారి కుటుంబానికి చెందినవేనని గ్రామస్తులు నేటికీ చెప్పుకుంటుంటారు. దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుతో కూడా ఈ కుటుంబానికి సన్ని హిత బంధుత్వం ఉన్నట్లు గ్రామ పెద్దలు పేర్కొంటున్నారు. కాలక్రమేణా కుటుంబ ఆస్తులు చేజారిపోవడంతో సురేందర్ రావు నిరుపేద స్థితికి చేరుకున్నారని గ్రామస్తులు తెలిపారు. ఇటీవల కిందపడడంతో తుంటి ఎముక విరిగిందని, సరైన వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉన్న తాతల కాలం నాటి ఇల్లు కూడా శిథిలావస్థకు చేరి పూర్తిగా కూలిపోవడంతో నిరాశ్రయుడిగా మారిపోయాడు. మందులు, ఆహారం కూడా అందక అర్ధాకలితో రోజులు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు వృద్ధాప్య పెన్షన్ దరఖాస్తు చేసుకున్న ఫలితం శూన్యమని గ్రామస్తులు పేర్కొంటున్నారు.
జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు సురేందర్ రావు దీనస్థితిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆయనకు ఆర్థిక సాయం, మెరుగైన వైద్యం, భోజన వసతి కల్పించేలా చర్యలు తీసుకోవాలని కడిపికొండ గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజాసేవ చేసిన కుటుంబ సభ్యుడు నేడు ఇలాంటి దయనీయ పరిస్థితిలో ఉండడం బాధాకరమని, ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి సురేందర్ రావుకు చేయూతనందించాలని కోరుతున్నారు. దాతలు వైద్యంతో పాటు చేయూతనందించడానికి 86866–00049 నంబర్‌కు ఫోన్ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
దయనీయ స్థితిలో
మాజీ ఎమ్మెల్సీ కుమారుడు
ప్రభుత్వ సాయం కోసం
గ్రామస్తుల విజ్ఞప్తి


