గుండెపోటుతో బీఆర్‌ఎస్‌ నాయకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో బీఆర్‌ఎస్‌ నాయకుడి మృతి

Jul 28 2026 1:24 AM | Updated on Jul 28 2026 1:24 AM

నల్లబెల్లి: అభిమాన నాయకుడు ఆరోగ్య పరిస్థితి చూసి తీవ్ర మనోవేదనకు గురైన బీఆర్‌ఎస్‌ నాయకుడు, వార్డు మెంబర్‌ ఊరటి నరేశ్‌(46) గుండెపోటుతో మృతి చెందాడు. కుటుంబీకుల కథనం ప్రకారం.. వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలం కొండాయిల్‌పల్లి గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ నాయకుడు, రెండో వార్డు సభ్యుడు నరేశ్‌ పార్టీలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డికి వీరాభిమాని. తన అభిమాన నాయకుడు సుదర్శన్‌ రెడ్డి గుండెపోటుతో అస్వస్థకు గురై హనుకొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలుసుకుని ఆదివారం ఉదయం ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ పెద్ది ఆరోగ్య పరిస్థితి గమనించి, హైదరాబాద్‌ తరలించేవరకూ ఉన్నాడు. తిరిగి గ్రామానికి వచ్చిన తర్వాత తీవ్ర ఆవేదనలో ఉన్న నరేశ్‌ సోమవారం ఉదయం ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. వైద్యులు గుండె పోటుగా నిర్ధారించినట్లు కుటుంబీకులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

ఇన్సూరెన్స్‌

డబ్బులు ఇవ్వలేదని..

పెద్దనాన్నను హత్య చేసిన యువకుడు

నిందితుడి అరెస్ట్‌, రిమాండ్‌

దుగ్గొండి: వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామానికి చెందిన ముస్కుల సాంబరెడ్డి(56) హత్య కేసులో అతడి తమ్ముడి కుమారుడు రాజును అరెస్ట్‌ చేసినట్లు సీఐ సాయిరమణ సోమవారం తెలిపారు. గ్రామానికి చెందిన ముస్కుల తి రుపతిరెడ్డి మూడు నెలల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. తిరుపతిరెడ్డికి నామినీగా ఉన్న అ న్న సాంబరెడ్డికి రైతు బీమా కింద రూ. 5 లక్షలు వ చ్చాయి. గత శుక్రవారం మధ్యాహ్నం బ్యాంకు నుంచి డబ్బులు తీసుకుని తనకు ఇవ్వకుండా తన త మ్ముడు తిరుమల్‌కు ఇచ్చాడని రాజు కోపోద్రెకుడిగా మారాడు. దీంతో శుక్రవారం అర్ధరాత్రి తన పెద్దనాన్న సాంబరెడ్డిని కర్రతో కొట్టి హత్య చేశాడు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కే సు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి రాజును అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. దీంతో అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ తెలిపారు. ఎస్సై రణధీర్‌రెడ్డి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement