ముగిసిన జిల్లా స్థాయి చదరంగం పోటీలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన జిల్లా స్థాయి చదరంగం పోటీలు

Jul 27 2026 1:12 AM | Updated on Jul 27 2026 1:12 AM

మాంసం విక్రయాలు తనిఖీ

వరంగల్‌ స్పోర్ట్స్‌: వరంగల్‌ జిల్లా చదరంగ సమైక్య ఆధ్వర్యంలో హనుమకొండ రెడ్డికాలనీలోని మాస్టర్జీ వికాస్‌ హైస్కూల్‌ ఆవరణలో ఆదివారం నిర్వహించిన ఉమ్మడి వరంగల్‌ జిల్లా స్థాయి అండర్‌–13 బా లబాలికల చదరంగ పోటీలు ముగిశాయి. ఈ ము గింపు వేడుకలకు డాక్టర్‌ ఏలియా, సేజ్‌ హైస్కూల్‌ డైరెక్టర్‌ మోహన్‌ రెడ్డి, కెస్ట్‌ మిత్ర ఫౌండర్‌ మధు హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం చెస్‌ టోర్నమెంట్‌ నిర్వహణ కార్యదర్శి కన్నా మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 50 మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన పోటీల్లో బాలుర విభాగంలో సాయి ప్రీతం, శ్రియన్‌రామ్‌, అక్షిత్‌ చౌహాన్‌, దావల్‌ సాయి, బా లికల విభాగం నుంచి ఆద్య అనిశెట్టి, వెన్నమల్ల దిలీషా, మునిగాల అక్షర, సహస్ర విజేతలుగా నిలి చినట్లు తెలిపారు. వీరు ఆగస్టులో హైదరాబాద్‌లో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో వరంగల్‌ జిల్లా నుంచి ప్రా తినిథ్యం వహిస్తారని తెలిపారు. చీఫ్‌ ఆ ర్బిటర్‌ ప్రేమ్‌ సాగర్‌, షణ్ముఖ, రాము పాల్గొన్నారు.

రైతులు సుభిక్షంగా

ఉండాలని వరుణ జపం

హన్మకొండ కల్చరల్‌: సకాలంలో వర్షాలు కురవా లని, రైతులు సుభిక్షంగా ఉండాలని వరుణ జపం, రుద్రాహోమాలు నిర్వహించినట్లు వే యిస్తంభాల దేవాలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ అన్నారు. దేవాదాయశాఖ కమిషనర్‌ ఆదేశాల మేర కు మూడు రోజులుగా నిర్వహించిన వరుణ జపం, పూజలు ఆదివారం ముగిశాయి. ఈ మేరకు ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో దేవాలయంలో వరుణ జపం, రుశ్యశృంగ పారా యణం, నవగ్రహమంత్రయుక్తంగా వరుణ రుద్రహోమం నిర్వహించారు. అనంతరం వివిధ ఫలపుష్పాలతో మహాపూర్ణాహుతి చేశారు. భక్తులకు ప్రసాదాల వితరణ చేశారు. ఈ సందర్భంగా ఉపేంద్రశర్మ మాట్లాడుతూ లోక కల్యాణార్థం పంచభూతాల్లోని ప్రకృతిని రక్షించుకోవడానికి రుద్రహోమాలు నిర్వహించినట్లు తెలిపారు. వేలాదిమంది భక్తులు దేవాలయాన్ని సందర్శించారు. వేదపండితుడు గంగు మణికంఠశర్మ అవధాని, అర్చకులు ప్రణవ్‌, సాయితేజ, శ్రీవత్సవాచార్యులు, శ్రీమాన్‌ నారాయణచార్యులు, రేవన్‌, అక్షయ్‌ పూజలు నిర్వహించారు. ఆలయ ఈఓ అనిల్‌కుమార్‌ పర్యవేక్షించారు.

వరంగల్‌ అర్బన్‌: వరంగల్‌ లక్ష్మీపురం జంతువధ శాలను ఆహార కల్తీ నియంత్రణ, బల్దియా వెట ర్నరీ, వినియోగదారుల మండలి ప్రతినిధులు ఆది వారం తనిఖీ చేశారు. మేకలు, గొర్రెలను, మటన్‌ షాపుల్లో విక్రయిస్తున్న మాంసం విక్రయాలను పరిశీలించారు. నామమాత్రంగా జంతు వధను కబేళాకు తరలించి, ఇళ్లల్లో, ఖాళీ స్థలాల్లో వధించి విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించారు. జంతువుల మాంసం, తల, బోటీలను దుర్గంధ ప్రదేశాల్లో శుభ్రం చేస్తుండడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనలకు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గెజిటెడ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ కృష్ణమూర్తి, గ్రేటర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ వెటర్నరీ ఆఫీసర్‌, వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి, రాష్ట్ర వినియోగదారుల సమాఖ్య అధ్యక్షుడు మొగిలిచర్ల సుదర్శన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement