‘సర్‌’లో మీ పేరుందా? | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’లో మీ పేరుందా?

Jul 27 2026 1:12 AM | Updated on Jul 27 2026 1:12 AM

ఎస్‌ఎంఎస్‌తో

వివరాలు

కాజీపేట : ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌) గడువు దగ్గర పడుతోంది. ఈనేపథ్యంలో ఓట రు జాబితాలో మీపేరు ఉందో లేదో ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా పరిశీలించాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. ఓటరు జాబితాలో పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి 1950 హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేయొచ్చు. లేదా ఈసీఐ ఓటరు హెల్ప్‌లైన్‌ యాప్‌ ద్వారా కూడా సులభంగా వివరాలు తెలుసుకోవచ్చు. అదేవిధంగా నమోదిత మొబైల్‌ నంబర్‌ నుంచి ఈసీఐ తెలిపిన విధానంలో ఎస్‌ఎంఎస్‌ పంపడం ద్వారా కూడా ఓటరు వివరాలను తెలుసుకునే అవకాశం ఉంది.

ఎలా తెలుసుకోవాలంటే..

ఎస్‌ఐఆర్‌లో మీ పేరు నమోదు కాకపోతే ఓటు హక్కు కోల్పోతారు. ఈనేపథ్యంలో ఓటర్లు తమ ఎస్‌ఐఆర్‌ పూర్తయ్యిందా..? లేదా అనే వివరాలు తెలుసుకోవడానికి ఎన్నికల సంఘం చక్కటి అవకాశం కల్పించింది. ఎస్‌ఎంఎస్‌ ద్వారా తెలుసుకోవాలంటే ఈసీఐ అని టైపు చేసి స్పేస్‌ ఇచ్చి ఆ తర్వాత ఓటరు ఐడీ నంబర్‌ నమోదు చేయాలి. అనంతరం 1950 నంబర్‌కు మెస్సేజ్‌ పంపించాలి. సెకన్లలోనే ఈసీ నుంచి మెసేజ్‌ వస్తుంది. అందులో మీపేరు, సీరియల్‌ నంబర్‌, పోలింగ్‌ కేంద్రం, పార్ట్‌ నంబర్‌, నియోజక వర్గం వివరాలు ఉంటాయి. ఈ వివరాలు వస్తే మీపేరు ఎస్‌ఐఆర్‌లో నమోదైనట్లు అర్థం చేసుకోవాలి. మెసేజ్‌లో వివరాలు తప్పుగా ఉన్నా లేదా మెసేజ్‌ రాకపోయినా బూత్‌ లెవల్‌ ఆఫీసర్‌ లేదా ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement