చిన్నారి హత్యకు యత్నించిన వ్యక్తి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

చిన్నారి హత్యకు యత్నించిన వ్యక్తి అరెస్ట్‌

Jul 26 2026 2:38 AM | Updated on Jul 26 2026 2:38 AM

పెరగనున్న టోల్‌ చార్జీలు ఇలా...

వివరాలు వెల్లడించిన పోలీసులు

కొడకండ్ల : పాత గొడవలు, భూతగాదాలను దృష్టిలో ఉంచుకుని ఓ చిన్నారి హత్యకు యత్నించిన నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై చింత రాజు తెలిపారు. ఈ మేరకు శనివారం కేసు వివరాలను విలేకరులకు వివరించారు. జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రానికి చెందిన అందె మధు, జ్యోతి దంపతుల కుమార్తె నౌమిక శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తమ ఇంటి సమీపంలోని అందె సత్తార్‌ ఇంటి ఆవరణలోని సంపులో అనుమానాస్పదంగా పడి మూత పెట్టి ఉంది. అదే సమయంలో తన కూతురి కోసం తల్లి జ్యోతి వెతుకుతూ సంపు వైపు వెళ్లగా అమ్మ అని అరుపులు వినిపించాయి. దీంతో సమీపంలో ఉన్న అందె భవాని, ఉప్పలమ్మ సాయంతో సంపు నుంచి కూతురిని జ్యోతి బయటకు తీసింది. ఇదే సమయంలో తనను చూసి అందె రంజిత్‌ అనే వ్యక్తి పారిపోయాడని, అతనిపై అనుమానం ఉందని జ్యోతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకుని విచారించగా చిన్నారి తాత అందె వెంకన్నతో గత పాత గొడవలు, భూతగాదాలపై కక్ష పెంచుకుని నౌమిక హత్యకు యత్నించినట్లు నిందితుడు అంగీకరించినట్లు ఎస్సై తెలిపారు.

పెరిగిన కోమళ్ల

టోల్‌ ప్లాజా రుసుములు

రఘునాథపల్లి : వరంగల్‌ – హైదరాబాద్‌ జాతీయ రహదారిలోని రఘునాథపల్లి మండలం కోమళ్ల టోల్‌ ప్లాజా రుసుములు పెరిగాయి. పెరిగిన చార్జీలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. 2026–27 ఆర్థిక సంవత్సరానికి లింకింగ్‌ ఫ్యాక్టర్‌ పునరుద్ధరణతో 5 శాతం టోల్‌ ధరల పెంపునకు జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) హైదరాబాద్‌ ప్రాంతీయ ఆఫీస్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ధరలు ఈ నెల 27, జూలై 2026 నుంచి 31, మార్చి 2027 వరకు అమలులో ఉంటాయి.

కారు, జీప్‌, వ్యాన్‌, లైట్‌ మోటారు వాహనం ఒక వైపు రూ 130, ఇరు వైపులా రూ. 190, నెల వారీ 4,295, లైట్‌ కమర్షియల్‌ వాహనం, లైట్‌ గూడ్స్‌ వాహనం, మినీ బస్సు ఒకవైపు రూ. 210, ఇరువైపులా రూ. 310, నెలవారీ రూ. 6,935, బస్సు, ట్రక్కుకు ఒక వైపు రూ. 435, ఇరువైపులా రూ. 655, నెల వారీ రూ. 1,4530, త్రీ యాక్షల్‌ కమర్షియల్‌ వాహనం ఒక వైపు రూ. 475, ఇరు వైపులా రూ. 715, నెలవారీ రూ.1,5850, హెచ్‌సీఎం, ఈఎంఈ వాహనం ఒకవైపు రూ. 685 ఇరువైపులా రూ.1,025, నెలవారీ రూ. 22,785, ఓవర్‌సైజ్‌ వాహనం ఒక వైపు రూ. 830, ఇరువైపులా రూ. 1,250, నెల వారీ రూ. 27,740కు పెంచారు. నెల వారి పాస్‌ రూ. 350 నుంచి రూ. 360కి పెరిగింది.

రేపటి నుంచి అమల్లోకి

ఐదు శాతం పెరగనున్న ధర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement