నర్సంపేట రూరల్ : మృత్యువులోనూ ఆ అన్నదమ్ముల రక్తబంధం వీడి పోలేదు. అనారోగ్యంతో ఒకే రోజు ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటన శనివారం వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని సర్వాపురంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. సర్వాపురం గ్రామానికి చెందిన కందికొండ కనుకయ్య, శాంతమ్మ దంపతులకు కొమురయ్య (81), నర్సయ్య (78)తో పాటు కూతురు ఉంది. కొమురయ్య, నర్సయ్య వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. కొమురయ్యకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు, నర్సయ్యకు ముగ్గురు కుమారులు, ఇద్దరులు కుమార్తెలు ఉన్నారు. రెండు నెలలుగా అనారోగ్యం పాలై ఇంటి వద్దనే ఉంటున్నారు. ఈ క్రమంలో తొలిఏకాదశి పండుగ రోజే ఇద్దరూ మృతి చెందారు. ఈ ఘటనతో కుటుంబంతోపాటు గ్రామంలో విషాదఛాయలు అలుముతున్నాయి.
అనారోగ్యంతో ఒకే రోజు
అన్నదమ్ముల మృతి
సర్వాపురంలో ఘటన


