జిల్లాస్థాయి యోగా పోటీలు | - | Sakshi
Sakshi News home page

జిల్లాస్థాయి యోగా పోటీలు

Jul 25 2026 12:59 AM | Updated on Jul 25 2026 12:59 AM

మహబూబాబాద్‌ అర్బన్‌: మానుకోట మున్సిపల్‌ పరిధి జమాండ్లపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో జిల్లాస్థాయి యోగా పోటీలు ఈ నెల 26న ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు యోగా అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షురాలు తూనం పుష్పలీల శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సబ్‌ జూనియర్‌, సీనియర్‌, మాస్టర్స్‌ గ్రూప్‌లకు సంబంధించిన యోగా పోటీలు నిర్వహిస్తామన్నారు. యోగా పోటీల్లో 10నుంచి 14 ఏళ్ల వయస్సు వారు, 14 నుంచి 18, 18 నుంచి 28, 28 నుంచి 38, 38 నుంచి 45, 45 నుంచి 55 ఏళ్ల వయస్సు వారికి విభాగాల వారీగా అవకాశం ఉందన్నారు. పూర్తి వివరాలకు 99851 85257, 89197 03008 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement