● వీసీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
సంజయ్ జాజు
మహబూబాబాద్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫామ్‌ల కుట్టు పనులు సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం ఆయన వ్యవసాయ పరిస్థితులు, తాగునీరు, విద్యుత్ తదితర విషయాలపై జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈసందర్భంగా సంజయ్ జాజు మాట్లాడుతూ.. ప్రతీ పనిలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. పంట మార్పి డి, ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పించి సాగు చేసేలా ప్రోత్సహించాలన్నారు. వీసీలో జిల్లా నుంచి కలెక్టర్ స్నేహశబరీష్, అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్, ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ పురుషోత్తం, సంబంధిత అదికారులు పాల్గొన్నారు.


