● ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్
కేసముద్రం: పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మానుకోట ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. నీట్ పేపర్ లీక్‌ను నిరసిస్తూ గురువారం మున్సిపాలిటీ పరిధి అంబేడ్కర్ సెంటర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నీట్‌పేపర్ లీక్‌తో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని, దీనిపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీని అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీక్ బాధ్యులపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అల్లం నాగేశ్వర్‌రావు, జిల్లా అధికార ప్రతినిధి అంబటి మహేందర్‌రెడ్డి, గుగులోతు దస్రూనాయక్, నీలం దుర్గేష్, బండారు వెంకన్న, కదిర సురేందర్, బండారు దయాకర్, పోలెపాక నాగరాజు, రావుల మురళి, ఎండి.అయూబ్‌ఖాన్, కీర్తి సురేందర్, చిదురాల వసంతరావు, గండి శ్రీను, చిలువేరు సమ్మయ్యగౌడ్, కొయ్యాడ అశోక్, తండా వెంకన్న, పోలెపల్లి వెంకట్‌రెడ్డి, కత్తెరశాల శ్రీను తదితరులు పాల్గొన్నారు.


