కురవి: ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో నర్సరీదారులు స్వల్పకాలిక రకాల నారును పెంచాలని జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న అన్నారు. గురువారం మండల కేంద్రంలోని రైతు వేదికలో జిల్లాలోని నర్సరీదారులకు ఎల్‌నినో పరిస్థితులు–నర్సరీ చట్టంపై అవగాహన స దస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితులకు అనుకూలంగా నర్సరీల్లో మేలైన మొక్కలు పెంచాలని సూ చించారు. వ్యవసాయశాఖ ఆమోదం పొంది, రైతులు అంగీకారం తెలిపిన రకాల నారు పెంచాలన్నా రు. నర్సరీ చట్టం ప్రకారం ఆరుబయట నారును పెంచవద్దని, లైసెన్స్ లేకుండా నర్సరీ నుంచి మిరప, కూరగాయల నారు అమ్మవద్దన్నారు. మల్యాల కేవీకే ఉద్యాన శాస్త్రవేత్త ప్రశాంత్ భూసార, నీటి పరీక్షలు, కూరగాయల సాగు, పూలసాగు, నీటి ఎద్దడి, చీడపీడలను తట్టుకునే రకాలు, షేడ్‌నెట్స్, మల్చింగ్ పద్ధతుల గురించి వివరించారు. రైతులు పంట మార్పిడి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏడీఏ శ్రీనివాసరావు, శాస్త్రవేత్త సుహాసిని, హెచ్‌ఓలు ఆర్.శాంతిప్రియ, శాంత్రి ప్రియదర్శిని, ఎం.స్రవంతి, ఏఓ నరసింహరావు, ఏఈఓలు రాజేశ్వరి, విజయపాల్‌రెడ్డి, రమేశ్, నర్సరీ యజమానులు పాల్గొన్నారు.


