అభ్యసన సామర్థ్యాలు పెంపొందించాలి | - | Sakshi
Sakshi News home page

అభ్యసన సామర్థ్యాలు పెంపొందించాలి

Jul 24 2026 1:15 AM | Updated on Jul 24 2026 1:15 AM

కలెక్టర్‌ స్నేహశబరీష్‌

కురవి: వివిధ సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిలో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్‌ స్నేహశబరీష్‌ తెలిపారు. మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్‌లో మండల స్థాయి మూడు రోజుల ఇంటిగ్రేటెడ్‌ శిక్షణ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. కలెక్టర్‌ సందర్శించి పలు సూచనలు చేశారు. ఇంగ్లిష్‌, తెలుగు, గణితంలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించాలని తెలిపారు. వారిలో నైపుణ్యాలు, సామర్థ్యాలను పెంపొందించి తరగతిలో తోటి విద్యార్థులతో సమానంగా ఉండేలా చూడాలని, ఇలాంటి శిక్షణలు ఉపాధ్యాయులకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. శిక్షణలో 62మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. డీఈఓ సత్యనారాయణమూర్తి, ఎంఈఓ బాలాజీ, ఆర్‌పీలు శివప్రసాద్‌, వెంకటేశ్‌, ఓంకార్‌, శేఖర్‌ పాల్గొన్నారు. అనంతరం కంచర్లగూడెం గ్రామంలో జరుగుతున్న నక్షా సర్వే, సర్‌ డిజిటలైజేషన్‌ కార్యక్రమాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. తహసీల్దార్‌ విజయ, ఎంపీడీఓ వీరబాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement