నిషేధిత జలపాతాలకు వెళ్తే కేసులు నమోదు | - | Sakshi
Sakshi News home page

నిషేధిత జలపాతాలకు వెళ్తే కేసులు నమోదు

Jul 24 2026 1:15 AM | Updated on Jul 24 2026 1:15 AM

వాజేడు: పర్యాటకులు నిషేధిత జలపాతాలకు వెళ్తే కేసులు నమోదు చేయాలని కాళేశ్వరం చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట ప్రభాకర్‌ అన్నారు. మండల పరిధిలోని బొగత జలపాతం వద్ద గురువారం ములుగు జిల్లా అటవీ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అనుమతులు లేని జలపాతాలకు ఎవరూ వెళ్లకుండా సిబ్బంది పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. దొంగ దారిలో ఎవరూ వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని, అందుకు జలపాతాలు ఉన్న సమీప గ్రామాల ప్రజలతో సమావేశాలు నిర్వహించి వారి సహకారాలు తీసుకోవాలని సూచించారు. సమా వేశంలో ములుగు డీఎఫ్‌ఓ వికాస్‌ మీనా, వెంకటాపురం ఎఫ్‌డీఓ ద్వాలియా, వాజేడు, వెంకటాపురం ఎఫ్‌ఆర్‌ఓలు నరేందర్‌, ముక్తార్‌ హుస్సేన్‌, ఏటూరునాగారం, ములుగు, తాడ్వాయి ఎఫ్‌డీఓలు, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement