ములుగు రూరల్ : అటవీ జంతువును వేటాడిన ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎఫ్‌ఆర్‌ఓ అమృత గురువారం తెలిపారు. ములుగు మండలం పత్తిపల్లి శివారు బుగ్గజలం అటవీప్రాంతంలో గ్రామానికి చెందిన కుక్కల రమేశ్, భట్టు రాంబాబు, లాకావత్ సోమ నాలుగు రోజుల క్రితం మనుబోతును వేటాడి చంపారు. దీనిపై సమాచారం అందిన వెంటనే అటవీశాఖ అధికారులు ఘటనా స్థలికి చేరుకోగా వేటగాళ్లు గమనించి పరారయ్యారు. దీంతో మనుబోతును స్వాధీనం చేసుకుని గుంతతీసి పూడ్చి పెట్టారు. నిందితులపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా జిల్లా అటవీశాఖ కార్యాలయంలో లొంగిపోయారు. దీంతో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎఫ్‌ఆర్‌ఓ తెలిపారు.


