తొర్రూరు రూరల్: పాము కాటుతో ఓ యువకుడి మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం సోమారపుకుంట తండాలో చోటు చేసుకుంది. తండా వాసుల కథనం ప్రకారం.. బానోత్ ప్రవీణ్(25) రోజువారీగా బుధవారం రాత్రి తన ఇంటి ఎదుట రేకులషెడ్‌లో కింద నిద్రిస్తుండగా అర్ధరాత్రి సమయంలో పాము కాటు వేసింది. వెంటనే నిద్రనుంచి లేచిన ప్రవీణ్ పామును చంపాడు. ఆస్పత్రికి వెళ్దామని కుటుంబీకులు చెప్పినా వినకుండా మళ్లీ నిద్రపోయాడు. ఈక్రమంలో గురువారం తెల్లవారుజామున వాంతులు, విరోచనాలు కావడంతో వెంటనే అంబులెన్స్‌లో మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య మమత ఉంది.


