అంకితభావంతో పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

అంకితభావంతో పనిచేయాలి

Jul 23 2026 1:18 AM | Updated on Jul 23 2026 1:18 AM

డోర్నకల్‌ ఎమ్మెల్యే

డాక్టర్‌ జాటోతు రామచంద్రునాయక్‌

మరిపెడ మున్సిపాలిటీ కోఆప్షన్‌

సభ్యుల ఎన్నిక

మరిపెడ: సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేయాలని డోర్నకల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ జాటోతు రామచంద్రునాయక్‌ అన్నారు. మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్లో బుధవారం మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక, ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మరిపెడ మున్సిపల్‌ అభివృద్ధికి పాలకవర్గం సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు. నూతనంగా ఎన్నికై న కో–ఆప్షన్‌ సభ్యులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ వీసారపు ప్రగతిశ్రీపాల్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ కాలం సునీతరవీందర్‌రెడ్డి, కమిషనర్‌ నరేష్‌రెడ్డి, పీసీసీ పరిశీలకులు హఫీజ్‌ఖాన్‌, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement