సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించాలి

Jun 2 2026 5:41 AM | Updated on Jun 2 2026 5:41 AM

కలెక్టర్‌ స్నేహశబరీష్‌

మహబూబాబాద్‌: ప్రజావాణిలో వచ్చిన వినతులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ స్నేహశబరీష్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా కలెక్టర్‌ వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న వినతులను పరిష్కరించాలన్నారు. రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు. ఎండల తీవ్రత ఎక్కువ ఉన్నందున తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. ప్రజావాణిలో 142 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అనిల్‌కుమార్‌, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement