● స్వగ్రామంలో అంత్యక్రియలు పూర్తి
గూడూరు : ప్రేమ విఫలమైందనే కారణంతో హైదరాబాద్‌లోని ఓయూ సమీపంలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న మహబూబాబా ద్ జిల్లా గూడూరు మండలం గోవిందాపురం గ్రామానికి చెందిన బోడ వినేశ్(19) చికిత్స పొందుతూ సోమవారం రాత్రి గాంధీ ఆస్పత్రిలో మృతి చెందాడు. వినేశ్ మృతికి గల కారణాలపై విచారించిన పోలీసులు పోస్టుమార్టం అనంతరం మంగళవారం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో స్వగ్రామం గోవిందాపురంలో వినేశ్ అంత్యక్రియలు నిర్వహించారు. కాగా,వినేశ్ మృతికి ఎవరూ కారణం కాదని కుటుంబ సభ్యులు తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు.
రైళ్లలో హిజ్రాల వేధింపులపై ఆన్‌లైన్ ఫిర్యాదులు
కాజపేట రూరల్ : సికింద్రాబాద్ డివిజన్ పరిధి కాజీపేట సబ్ డివిజన్ సెక్షన్‌లో పలు రైళ్లలో హిజ్రాలు ప్రయాణికులను వేధిస్తున్నారని ఇటీవల ఆన్‌లైన్ ఫిర్యాదులు వచ్చాయని రైల్వే అధికారులు మంగళవా రం తెలిపారు. ఈ మేరకు రైల్వే నిఘా విభాగం అధికారులు కొన్ని రో జుల క్రితం క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారన్నారు. ఇందులో కాజీపేట సె క్షన్‌లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్.. హిజ్రాలను కట్టడి చేయడంలో విఫలమయ్యారని గుర్తించి ఓ ఆర్‌పీఎఫ్ అధికారిని సస్పెండ్ చేశామని పే ర్కొన్నారు. కాగా, సదరు పోలీస్ అధికారి పది రోజుల పాటు సస్పెన్షన్‌లో ఉండి తిరిగి విధుల్లో చేరారని పోలీస్ అధికారులు తెలిపారు.


