విద్యుత్‌ కార్మికులను క్రమబద్ధీకరించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ కార్మికులను క్రమబద్ధీకరించాలి

Apr 10 2026 10:33 AM | Updated on Apr 10 2026 10:33 AM

తొర్రూరు: విద్యుత్‌ కార్మికుల సేవలను క్రమబద్ధీకరించాలని ఎన్పీడీసీఎల్‌ జేఏసీ చైర్మన్‌ ధరావత్‌ సికిందర్‌ అన్నారు. విద్యుత్‌ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ గురువారం డివిజన్‌ కేంద్రంలోని విద్యుత్‌ శాఖ డివిజన్‌ కార్యాలయం ఆవరణలో రెండో రోజు సమ్మె చేపట్టారు. సికిందర్‌ మాట్లాడుతూ.. విద్యుత్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం, విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలదేనన్నారు. విద్యార్హతల ఆధారంగా కార్మికులను కన్వర్షన్‌ చేయాలని, ఆర్టిజన్లకు ఏపీఎస్‌ఈబీ సర్వీస్‌ రూల్‌ వర్తింపజేయాలన్నారు. అన్‌మ్యాన్డ్‌ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలన్నారు. కార్యక్రమంలో జేఏసీ డివిజన్‌ చైర్మన్‌ పసుపులేటి మధు, నాయకులు జ్యోతి, సంధ్య, హరీశ్‌, రామకృష్ణ, ఉపేందర్‌, సుదర్శన్‌, పాషా, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement