హెచ్‌ఐవీ నివారణకు ముందస్తు పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

హెచ్‌ఐవీ నివారణకు ముందస్తు పరీక్షలు

Apr 10 2026 10:33 AM | Updated on Apr 10 2026 10:33 AM

నెహ్రూసెంటర్‌: హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై సమాజంలో అవగాహన పెంపు, ముందస్తు పరీక్షల చేయడం ద్వారా వ్యాధిని నివారించవచ్చని డీఎంహెచ్‌ఓ రవి రాథోడ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు.డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. హెచ్‌ఐవీపై భయం అవసరం లేదని, సరైన సమయంలో పరీక్షలు చేయించుకోవడం వల్ల వ్యాధిని నియంత్రించవచ్చని తెలిపారు. సమాజంలో ఉన్న అపోహలు, వివక్షను తొలగించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. హెచ్‌ఐవీ బాధితులు ప్రభుత్వ వైద్య సేవలన వినియోగించుకోవాలని సూచించారు. నర్సింగ్‌ విద్యార్థులు, అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ సిబ్బంది, సర్వోదయ యువజన స్వచ్ఛంద సంస్థ సభ్యులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది భారీ సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. ప్రోగ్రాం అధికారి అర్జున్‌, జిల్లా డిప్యూటీ మాస్‌ మీడియా అధికారి ప్రసాద్‌, శ్రీనివాస్‌, దిశ సారంగం, రమేశ్‌, వీరస్వామి, శాంతరాజ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement