సమర్థ్ధ పాలకుడు ప్రతాపరుద్రుడు | - | Sakshi
Sakshi News home page

సమర్థ్ధ పాలకుడు ప్రతాపరుద్రుడు

Mar 26 2026 10:30 AM | Updated on Mar 26 2026 10:30 AM

హన్మకొండ కల్చరల్‌ : కాకతీయుల రాజైన ప్రతాపరుద్రుడు సమర్థ పాలకుడని, ఆయన పాలన దక్షిణ భారతదేశ చరిత్రలో ముఖ్యమైనదని చరిత్ర తెలియజేస్తోందని వేయిస్తంభాల దేవాలయం ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ పేర్కొన్నారు. బుధవారం వేయిస్తంభాల ఆలయ ‘కుడా’ గార్డెన్‌లో దేవరకొండ విష్ణువర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఐదో కాకతీయుల రాజు ప్రతాప రుద్రదేవుడి జయంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రతాపరుద్రుడి చిత్రపటానికి పూలమాల వేసి స్మరించుకున్నారు. ఈ సందర్భంగా గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక, ప్రజలు ప్రశాంతంగా జీవించడానికి దేవాలయాలు నిర్మించారని తెలిపారు. విష్ణువర్ధన్‌ మాట్లాడుతూ.. ప్రజల కోసం తాగునీరు, రైతులు సుభిక్షంగా ఉండాలని సాగునీరు కోసం గొలుసుకట్టు చెరువులు నిర్మించారని అన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, పోతుల శ్రీమాన్‌, సురేందర్‌, రజవలి, జక్కుల రవీందర్‌ యాదవ్‌, తాడిశెట్టి విద్యాసాగర్‌, తోట పవన్‌కుమార్‌, టీఎన్జీఓస్‌ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్‌, సోమయ్య, వేణుగోపాల్‌, తదితరులు పాల్గొన్నారు.

వేయిస్తంభాల దేవాలయ

ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ

ఘనంగా ప్రతాపరుద్రుడి జయంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement