సమయం లేదు మిత్రమా.. | - | Sakshi
Sakshi News home page

సమయం లేదు మిత్రమా..

Mar 23 2026 8:54 AM | Updated on Mar 23 2026 8:54 AM

మహబూబాబాద్‌: పన్నుల వసూళ్లలో జిల్లా వెనుకబడింది. గత ఆర్థిక సంవత్సరం 93శాతం వసూలు కాగా.. ప్రస్తుతం ఇప్పటి వరకు 63శాతం వసూలు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం మరో 9రోజుల గడువు మాత్రమే మిగిలి ఉండగా.. వందశాతం వసూలు చేయడం అధికారులకు సవాల్‌గా మారింది. మల్టీపర్పస్‌ వర్కర్లు, బిల్‌ కలెక్టర్లు, పంచాయతీ కార్యదర్శులు పన్నులు వసూళ్లు చేస్తున్నారు. అయితే పూర్తి బాధ్యత పంచాయతీ కార్యదర్శులపైనే ఉంది.

18 మండలాలు.. 482 జీపీలు..

జిల్లాలో 18 మండలాల్లో 482 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కాగా, జిల్లాలో 1,687మంది మల్టీపర్పస్‌ వర్కర్లు ఉండగా వారితో పాటు బిల్‌ కలెక్టర్లు, పంచాయతీ కార్యదర్శులు ఇంటి పన్నులు వసూలు చేస్తున్నారు. కాగా, గత ఆర్థిక సంవత్సరం 2024– 25లో ఇంటి పన్నుల డిమాండ్‌ 4,94,36,938 ఉండగా.. రూ.4,59,95,402 వసూలు చేశా రు. 93శాతం వసూలు చేసి ఉన్నతాధికారుల మన్ననలు పొందారు.

63 శాతం మాత్రమే..

జిల్లాలో ఈనెల 20వ తేదీ వరకు రూ.4,90,14,538 డిమాండ్‌కు కేవలం రూ.3,09,92,606 వసూలు చేసి 63శాతంగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల బకాయిలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. తొమ్మిది రోజుల్లో పన్నులు వసూలు అవుతాయని చెబుతున్నారు. అయితే వందశాతం మాత్రం పూర్తి అయ్యేలా కనిపించడం లేదు. కనీస గత ఆర్థిక సంవత్సరం వసూలైన 93 శాతం కూడా దాటే పరిస్థితి లేదు.

ఇప్పటి వరకు 63శాతమే పన్నుల

వసూలు

మరో 9రోజులు మాత్రమే గడువు

గత ఆర్థిక సంవత్సరంలో 93శాతం పన్నుల సేకరణ

పన్నుల వసూళ్ల వివరాలు ఇలా..

మండలం జీపీలు డిమాండ్‌ వసూలు

గంగారం 12 5,88,227 5,30,744

మానుకోట 41 26,616,08 22,858,73

చిన్నగూడూరు 11 7,76,235 6,24,065

డోర్నకల్‌ 26 12,374,67 9,66,328

నెల్లికుదురు 31 35,326,00 25,456,18

పెద్దవంగర 26 18,445,73 12,660,01

ఇనుగుర్తి 13 14,380,17 9,55,646

తొర్రూరు 31 34,270,92 22,140,76

సీరోలు 18 16,156,05 10,159,36

గార్ల 20 59,982,95 36,797,98

కొత్తగూడ 24 20,346,67 12,470,50

బయ్యారం 29 50,145,81 30,265,81

నర్సింహులపేట 23 21,985,90 13,219,50

మరిపెడ 48 21,338,01 12,719,78

కేసముద్రం 29 28,628,41 16,868,13

దంతాలపల్లి 18 19,594,05 11,082,17

గూడూరు 41 47,353,13 25,808,70

కురవి 41 49,556,21 26,650,62

మొత్తం 482 4,90,14,538 3,09,92,606

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement