కొత్తగూడ: ఐటీడీఎ పరిధిలో ఉద్యోగం చేస్తూ మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు ఆదివారం మండల కేంద్రంలోని ఐటీడీఎ గెస్ట్‌హౌస్‌లో కారుణ్య నియామక పత్రాలను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉపాధి కల్పనలో ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతుందన్నారు. కొత్తగూడ, గంగారం మండలాల పరిధిలో తేజావత్ పద్మకు క్రీడా పాఠశాలలో ల్యాబ్ అసిస్టెంట్‌గా, దయానారావు, చైతన్యకు ఆశ్రమ పాఠశాలలో వాచ్‌మెన్‌గా ఉద్యోగ నియామక పత్రాలు అందజేసినట్లు చెప్పారు. ఇంకా చాలా మంది కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్నారని, వారికి త్వరలోనే నియామక పత్రాలు అందజేసేందుకు కృషి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బిట్ల శ్రీనివాస్ తండ్రి వీరయ్య ఇటీవల మృతి చెందగా.. వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌లు, మండల నాయకులు పాల్గొన్నారు.


