రసాయన రహిత వ్యవసాయంతో మేలు | - | Sakshi
Sakshi News home page

రసాయన రహిత వ్యవసాయంతో మేలు

Mar 23 2026 8:54 AM | Updated on Mar 23 2026 8:54 AM

డోర్నకల్‌: రసాయన రహిత వ్యవసాయంతో అన్ని విధాలా మేలు జరుగుతుందని డీఏఓ బి.సరిత అన్నారు. మండలంలోని చిలుకోడు, గొల్లచర్ల, అమ్మపాలెం రైతు వేదికలతో పాటు సీరోలు మండలం మన్నెగూడెం రైతు వేదికలో ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్న రైతు మహోత్సవ కార్యక్రమం, ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని టీవీ ద్వారా రైతులు, అధికారులు తిలకించారు. అనంతరం రైతులతో శాస్త్రవేత్తల ఇష్టాగోష్టి కార్యక్రమం నిర్వహించి వివిధ పంటల్లో యాజమాన్య పద్ధతులు, భూసార పరీక్షల ప్రాధాన్యం, పంట మార్పిడి విశిష్టత గురించి రైతులకు అవగాహన కల్పించారు. డీఏఓ మాట్లాడుతూ.. పూర్వపు వ్యవసాయ పద్ధతులు లాభదాయకమని, రసాయన రహిత వ్యవసాయంతో మేలు జరుగుతుందని తెలిపారు. జిల్లా ఉద్యానశాఖ అధికారి మరియన్న, ఆత్మ చైర్మన్‌ నల్లు సుధాకర్‌రెడ్డి, ఏడీఏ విజయచంద్ర, కేవీకే శాస్త్రవేత్త క్రాంతికుమార్‌, ఏఓలు అనిల్‌కుమార్‌, చాయారాజ్‌, ఏఈఓలు అవినాష్‌, పవన్‌, చరణ్‌, ఎర్ర కర్ణ, భరత్‌, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement