● పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
తొర్రూరు: పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి తెలిపారు. మండలంలోని 53మంది లబ్ధిదారులకు ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్‌కుమార్, ఆయా గ్రామాల సర్పంచ్‌లతో కలిసి ఎమ్మెల్యే మాట్లాడారు. పేదలకు అనేక సంక్షేమ పథకాలు, రైతును రాజును చేసేందుకు తీసుకుంటున్న చర్యలు, మహిళలు ఆత్మగౌరవంతో జీవించేలా పలు కార్యక్రమాలు ప్రజా ప్రభుత్వం చేపడుతుందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో భరోసానిస్తుందన్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హామ్యానాయక్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్, కౌన్సిలర్ ముద్దసాని సురేశ్, నాయకులు పింగిళి ఉష, ఇట్టె శ్యాంసుందర్‌రెడ్డి, ముద్దం విక్రమ్‌రెడ్డి, బసనబోయిన రాజేష్, మహబూబ్‌రెడ్డి, ప్రతికంఠం దేవేందర్‌రాజు పాల్గొన్నారు.


