బడ్జెట్‌పై భిన్నాభిప్రాయాలు
– IIలోu
సంక్షేమ రంగాలకు
బడ్జెట్‌లో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యం
సాక్షి, మహబూబాబాద్ : తెంలగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మిశ్రమ స్పందన వస్తోంది. ప్రధానంగా విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీటి రంగాలకు ప్రాధాన్యం ఇచ్చి రాష్ట్రంలోని సంక్షేమ పథకాలను సజీవంగా ఉంచారని కొందరు చెబుతుండగా.. కేటాయింపులు అరకొరగా ఉన్నాయని మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అల్పాహారం, మధ్యాహ్న భోజనం..
బడ్జెట్‌లో విద్యాశాఖకు ప్రాధాన్యత కల్పించారు. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ విద్యార్థుల వరకు 2026–27 విద్యాసంవత్స రం నుంచి బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలు చేయనున్నారు. అలాగే ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలులోకి రానుంది. పాలిటెక్నిక్ కళాశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి 15 కొత్త కోర్సులు ప్రవేశపెట్టనున్నారు. అదే విధంగా నైపుణ్య శిక్షణ కోసం ఐటీఐ, ఏటీసీ కళాశాలల్లో మొత్తం 242 మంది చదువుతుండగా.. వీరికి నెలకు రూ.2వేల చొప్పున ప్రోత్సాహకాలు అందనున్నాయి.
ఇందిరమ్మ ఇళ్లకు నిధులు..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లకు బడ్జెట్‌లో రూ.5,500 కోట్లు కేటాయించింది. జిల్లాలో మొదటి విడతలో 10,181 ఇళ్లు కేటాయించగా.. కొన్ని గృహప్రవేశాలు కాగా.. మిగితావి వివిధ దశల్లో ఉన్నాయి. ఇక రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించనున్నారు. ప్రభుత్వం నిధులు కేటాయించిన క్రమంలో రెండో విడతలో లబ్ధిదారులకు ఇళ్లు లభించనున్నాయి.
కొత్త పింఛన్‌పై ఆశలు..
చేయూత పథకానికి నిధులు కేటాయించిన నేపథ్యంలో పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఆశలు చిగురిస్తున్నా యి. జిల్లాలో 98,967మందికి నెలకు రూ.26,12,90,128 అందజేస్తున్నారు. అయితే రెండు సంవత్సరాలుగా కొత్త పింఛన్లు మంజూరు కాకపోవడంతో అన్ని అర్హతలు ఉండి జిల్లా వ్యాప్తంగా 12వేల మందికి పైగా ఎదురుచూస్తున్నారు. బడ్జెట్‌లో నిధులు కేటాయించిన నేపథ్యంలో కొత్త పింఛన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవారికి మోక్షం కలగనుంది.
డిజిటల్ హెల్త్ కార్డులతో ఉద్యోగుల్లో ఊరట..
ఉద్యోగులకు డిజిటల్ హెల్త్ కార్డుల పంపిణీకి బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. ఈ పథకం ద్వారా జిల్లాలోని 13వేల మంది ఉద్యోగులు, పెన్షర్లకు లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా ఇంటర్ నేషనల్ స్కూల్స్‌కు ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. జిల్లాలోని డోర్నకల్ నియోజకవర్గంలో అయ్యగారుపల్లి, మహబూబాబాద్ నియోజకవర్గంలో బొద్దుగొండ ప్రాంతాల్లో భూములు కేటాయించి శంకుస్థాపనలు చేశారు. బడ్జెట్‌లో కేటాయించిన నిధులతో పనులు జరగనున్నాయి. వ్యవసాయ రంగానికి మొత్తం రూ. 23,179కోట్లు కేటాయించారు. కాగా, జిల్లాలోని 2లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని లెక్కలు వేస్తున్నారు.
విద్యార్థులకు అల్పాహారం, యంగ్ ఇండియా స్కూల్స్‌కు నిధులు
చేయూత నిధులతో కొత్త పింఛన్లపై ఆశ
కేటాయింపులపై రాజకీయ వర్గాల్లో మిశ్రమ స్పందన
వివిధ వర్గాల మనోగతం


