పర్యాటకం @ ఇనుపరాతి గుట్టలు | - | Sakshi
Sakshi News home page

పర్యాటకం @ ఇనుపరాతి గుట్టలు

Mar 21 2026 5:14 AM | Updated on Mar 21 2026 5:14 AM

ఎకో టూరిజానికి అనుకూలం..

అక్రమ మైనింగ్‌ జరిగిన ప్రదేశం

గుట్టల శివారులో రిజర్వాయర్‌

దర్మసాగర్‌ : హనుమకొండ జిల్లాలో అటవీ ప్రాంతంగా పిలువబడే ధర్మసాగర్‌ మండలంలోని దేవునూరు ఇనుపరాతి గుట్ట పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని స్థానికులతోపాటు పర్యావరణ ప్రేమికులు ఆకాంక్షిస్తున్నారు. ధర్మసాగర్‌, వేలేరు, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల్లో సుమారు నాలుగు వేల ఎకరాల్లో ఈ గుట్టలు విస్తరించి ఉన్నాయి. హనుమకొండ జిల్లాలో ఒక శాతం అటవీ సంపద ఉన్నది ఈ ప్రాంతమే. దేవునూరు అటవీప్రాంతాన్ని వరంగల్‌ త్రినగరి ఊపిరితిత్తులుగా పిలుస్తుంటారు. కానీ, ప్రస్తు తం ఈ అటవీ భూముల్లో అక్రమ మైనింగ్‌, భూ ఆక్రమణలు జరుగుతున్నాయి. రెవెన్యూ, అటవీశాఖల ఆధునిక డిజిటల్‌ సర్వేలో సుమారు 3,900 ఎకరాల అటవీ శాఖ దేవునూరు గుట్టల్లో ఉన్నట్లు తేలింది. అయితే సుప్రీంకోర్టు తీర్పు, అటవీ సంరక్షణ చట్టం –1980 ప్రకారం దట్టమైన వృక్ష సముదాయం ఉండి రిజర్వ్‌ ఫారెస్ట్‌ పక్కన లేకున్నా ఆ ప్రాంతాన్ని అడవిగా పరిగణించాలి. కావునా దేవునూరు గుట్టలను రిజర్వ్‌ ఫారెస్ట్‌గా పరిగణించి అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

జంతు, వృక్ష జాతులకు నెలవు

దేవునూరు ఇనుపరాతి గుట్టల్లో ఎన్నో రకాల జంతు, వృక్ష జాతులున్నాయి. ఇక్కడ ఎలుగుబంట్లు, జింకలు, కొండ గొర్రెలు, కుందేళ్లు, నెమళ్లు, నక్కలతోపాటు అనేక పక్షి జాతులు, వివిధ రకాల ఔషధ మొక్కలతోపాటుగా ఇప్ప, నార, వేప, చింత, రావి లాంటి వృక్షజాతులు ఉన్నాయి. ఆహారం, పశుగ్రాసం, ఔషధ మొక్కలు, వంట చెరుకు నిలయంగా ఈ గుట్టలు విరాజిల్లుతున్నాయి. ఈప్రాంతంలో అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్టవేసి జీవవైవిధ్య పార్కుగా అభివృద్ధి చేయాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. ఇనుపరాతి గుట్టలను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు ప్రభుత్వనికి ఆదాయం సమకూరనుంది. కనీస వసతులుగా వాచ్‌ టవర్‌, పిక్నిక్‌ గద్దెలు, నైట్‌ క్యాంపు కల్పిస్తే వన సంపదకు రక్షణగా ఉంటుందనేది పలువురి అభిప్రాయం. ఇక్కడి ప్రజలు ముక్త కంఠంతో క్వార్జ్‌ మైనింగ్‌ ఏర్పాటును అడ్డుకోవడం అభినందనీయం.

నగరానికి కూతవేటు దూరంలోనే..

వృక్ష, జంతు జాతులకు నెలవు

గుట్టల్లో కొలువైన ప్రాచీన ఆలయాలు

అభివృద్ధి చేయాలంటున్న పర్యావరణ ప్రేమికులు

హనుమకొండలోని ఏకై క అటవీ ప్రాంతమైన ఇనుపరాతి గుట్టలు ఎకో టూరిజానికి అనుకూలంగా ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. వన్య సంపద ఉన్న ఈ ప్రాంతాన్ని రిజర్వ్‌ అడవిగా ప్రకటించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. సెక్షన్‌ 4, తెలంగాణ అటవీ చట్టం ప్రకారం ఇప్పటికే ఎన్నో భూసార, తేమ పరిరక్షణ చర్యలు చేపట్టినందుకున ఈ ప్రాంతం పర్యాటక పర్యావరణానికి అనుకూలమని స్పష్టమైంది. కావున ఈ ప్రాంతాన్ని ఎకో టూరిజంగా అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement