మహబూబాబాద్ రూరల్: జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య జిల్లాలోని గూడూరు మండలం మచ్చర్ల శివారు తార్యతండాలో ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్‌నాయక్‌ను పరామర్శించేందుకు నవజీవన్ ఎక్స్ ప్రెస్ రైలులో శుక్రవారం రాత్రి మానుకోట రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. ఈమేరకు ఆయనను కలెక్టర్ స్నేహ శబరీష్, ఎస్పీ శబరీష్, అదనపు కలెక్టర్ అనిల్ కుమార్, ఆర్డీఓ కృష్ణవేణి, డీఎస్పీ తిరుపతిరావు మర్యాదపూర్వంగా కలిశారు.
నాణ్యమైన భోజనం అందించాలి
గార్ల: విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో పాఠశాలల హెచ్‌ఎంలను ఆదేశించారు. శుక్రవారం గార్లలోని కస్తూర్బాగాంధీ, గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను ఆయ న ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత కేజీబీ వీలో ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు పట్టికలను పరిశీలించారు. అనంతరం పాఠశాలలోని స్టోర్‌రూంను పరిశీలించి బాలికలకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం వడ్డించాలన్నారు. అనంతరం గిరిజన బాలికల ఆశ్ర మ పాఠశాలను సందర్శించి, సైన్స్ ల్యాబ్ పరి కరాలు, కంప్యూటర్ గదిని తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ బా లికలకు నాణ్యమైన విద్య అందించాలన్నారు. అనంతరం పాఠశాల ఆవరణలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. గార్ల పంచాయతీలో క్రీడామైదానం కోసం ప్రభుత్వ భూమిని కేటా యించాలని సర్పంచ్ బానోత్ పార్వతి హతీ రాం అడిషనల్ కలెక్టర్‌ను కోరగా, వెంటనే తహ సీల్దార్‌ను పిలిచి ప్రభుత్వ స్థలం గుర్తించి కేటా యించాలని సూచించారు. తహసీల్దార్ శారద, ఎంపీఓ శ్రీలక్ష్మి, రాజేష్, పంచాయతీ కార్యదర్శి రమేశ్‌నాయక్, జీపీఓ దీపక్, హెచ్‌ఎంలు జోగ య్య, ఉషారాణి, పీడీ పద్మ పాల్గొన్నారు.


