జనగామ రూరల్: విద్యారంగానికి 15శాతం కేటాయిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేదు. గత బడ్జెట్‌లో విద్యారంగానికి 7.57 శాతం కేటాయించగా ఈసారి 8.22 శాతం కేటాయించారు. 105 యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణం, 2,500 ప్రీ ప్రైమరీ పాఠశాలలు, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ స్థాపన, పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారం వంటి కార్యక్రమాలు లక్ష్యాలు చేరుకోడానికి నిధులు సరిపోవు. కనీసం 20 శాతం నిధులు కేటాయించాలి.
– డీ.శ్రీనివాస్,
టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు


