వరంగల్ క్రైం: సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధి కేఎల్‌ఎన్‌రెడ్డి కాలనీలో శుక్రవారం మధ్యాహ్నం చైన్‌స్నాచింగ్ జరిగింది. సుబేదారి ఇన్‌స్పెక్టర్ రంజిత్‌కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. కేఎల్‌ఎన్‌రెడ్డి కాలనీలో నివాసముంటున్న మోడం స్వప్న ఇంటి నుంచి శుక్రవారం మధ్యాహ్నం తాను పనిచేస్తున్న మగ్గం వర్క్‌షాపునకు వెళ్తోంది. ఈక్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి మెడలోంచి బంగారు పుస్తెలతాడును లాక్కొని పరారయ్యారు. ఈమేరకు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
నేడు పలు పుష్‌పుల్ రైళ్ల రద్దు
కాజీపేట రూరల్: కాజీపేట సబ్ డివిజన్ పరిధిలో ఆపరేషన్స్ రీజన్స్ కారణంగా శనివా రం పలు రూట్లలో ప్రయాణించే పుష్‌పుల్ ప్యాసెంజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ ఏ.శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు.
రద్దు అయిన రైళ్ల వివరాలు..
కాజీపేట–డోర్నకల్(67765)వెళ్లే పుష్‌పుల్, డోర్నకల్ టు విజయవాడ(67767), విజయవాడ టు డోర్నకల్(67768), డోర్నకల్ టు కాజీపేట(67766), సికింద్రాబాద్ టు వరంగల్(67761), వరంగల్ టు సికింద్రాబాద్(67762)వెళ్లే పుష్‌ఫుల్ రైళ్లను రద్దు చేసినట్లు సీపీఆర్‌ఓ వివరించారు.
‘ఫలితాలు వెంటనే
ప్రకటించాలి’
ఎంజీఎం: తెలంగాణ మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు 2024 నవంబర్ 30న కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా నిర్వహించిన ఫార్మసిస్ట్ గ్రేడ్ – 2 ఉద్యోగ పరీక్ష నియామకాల ఫలితాలను వెంటనే ప్రకటించాలని రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ మాజీ ఉపాధ్యక్షులు ఉప్పు భాస్కరరావు డిమాండ్ చేశారు. ముందుగా.. 633 ఫార్మసిస్ట్ గ్రేడ్ – 2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు, అనంతరం మరో 99 పోస్టులను భర్తీ చేసేందుకు నిర్ణయించిందని, దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 732కు పెరిగిందని వివరించారు. ఈ పోటీ పరీక్షలకు రాష్ట్రంలో 24,578 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కాగా, దీర్ఘకాలికంగా ఫలితాలు ప్రకటించకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారని, దీంతో నిరుద్యోగ ఫార్మసీ అభ్యర్థులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారన్నారు. వెంటనే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు, వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు డైరెక్టర్లు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియలో సరైన పరిష్కారంతో సమస్యను పరిష్కరించి అర్హులకు నియామక ఉత్తర్వులు అందజేయాలని కోరారు.
సీఎం రేవంత్‌రెడ్డి
చిత్రపటానికి క్షీరాభిషేకం
విద్యారణ్యపురి: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఇంటర్ విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అల్పాహారం, మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయనున్నట్లు ప్రకటించడంతోపాటు అందుకు నిధులు కేటాయించడంతో ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం హర్షం వ్యక్తం చేసింది. శుక్రవారం హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ జవాబు పత్రాల వాల్యుయేషన్ క్యాంపు వద్ద సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి (ప్లెక్సీకి) క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల లెక్చరర్ల అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఇ.శ్రీనివాస్‌రెడ్డి, ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ సంఘం బాధ్యులు జితేందర్‌రెడ్డి, ఆర్.శ్రీనివాస్‌రావు, బి.సునీత, పుష్పలత, శ్రీదేవి, జూనియర్ లెక్చరర్ల సంఘం హనుమకొండ జిల్లా బాధ్యులు మహిపాల్‌రెడ్డి, రేవతి, జ్యోతిర్మయి, కృష్ణమోహన్, సంధ్యారాణి అధ్యాపకులు పాల్గొన్నారు.


