హసన్‌పర్తి: భారతీయ జనతాపార్టీ హసన్‌పర్తి మండలశాఖ మాజీ అధ్యక్షుడు కడిపికొండ సంతోష్‌రెడ్డి(38) ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఇంద్రారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ ఇన్‌స్పెక్టర్ చేరాలు తెలిపారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం అన్నాసాగరం గ్రామానికి చెందిన కడిపికొండ సంతోష్‌రెడ్డికి పదేళ్ల క్రితం ఇదే గ్రామానికి చెందిన కల్యాణితో వివాహం జరిగింది. వీరికి పదినెలల కుమారుడు ఉన్నాడు. కొంతకాలం పాటు వీరి కాపురం సవ్యంగానే సాగింది. అయితే గతేడాది నుంచి వీరి కాపురంలో గొడవలు మొదలయ్యాయి. ప్రస్తుతం సంతోష్‌రెడ్డి అత్తింటి వద్దనే ఉంటూ వ్యవసాయం చేస్తున్నాడు. కాగా, గురువారం రాత్రి సంతోష్‌రెడ్డి వ్యవసాయ బావి వద్దనే పురుగుల మందు తాగాడు. దీంతో వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. కాగా, బీజేపీ హనుమకొండ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ, 66వ డివిజన్ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మారపల్లి రాంచెంద్రారెడ్డి, సర్పంచ్ తాళ్లపల్లి కుమారస్వామి, బీజేపీ మండల అధ్యక్షుడు మారం తిరుపతి తదితరులు సంతోష్‌రెడ్డి మృతదేహం వద్ద నివాళులర్పించారు.
ఫాస్ట్‌ఫుడ్ హోటల్
నిర్వాహకుడి పరార్
వరంగల్: వరంగల్ స్టేషన్‌రోడ్డులోని ఫాస్ట్‌ఫుడ్ హో టల్ నిర్వాహకుడు సుమారు రూ.30 లక్షల వరకు ఎగనామం పెట్టి పరార్ కావడంతో పెట్టుబడి పెట్టి న ఫైనాన్సర్లు లబోదిబోమంటున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజేష్‌సింగ్ 8 ఏళ్ల క్రితం వ రంగల్ బస్టాండ్ సమీపంలో బండి పెట్టుకుని కుటుంబంతో సహా టీ, హోటల్ నిర్వహించేవాడు. బస్టాండ్ నిర్మాణంలో భాగంగా తాత్కాలిక నిర్మాణాలు తొలగించడంతో రైల్వేస్టేషన్ రోడ్‌లోని ఆయకర్ భవన్ పక్కనే ఉన్న ఖాళీ స్థలం లీజుకు తీసుకుని అంతకుముందు ఉన్న పరిచయాలతో ఫైనాన్సర్ల వద్ద రూ.లక్షల్లో అప్పుగా తీసుకుని కొత్తగా టీ హో టల్‌తోపాటు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ప్రారంభించాడు. హోటల్ పెద్దగా ప్రారంభించడంతో కిరాణ సామగ్రి, చికెన్ సప్‌లైదారులు ముందుగా సరుకులు సరఫరా చేసి వారం, నెలవారీగా వసూలు చేసుకునే వారు. ఇలా అందిన కాడికి అప్పులు చేసిన రాజేష్ సింగ్ రెండు రోజులుగా హోటల్ తీయలేదు. ఉగాది పండుగ వల్ల తీయలేదని అనుకున్నారు. ఈక్రమంలో ఉగాది తర్వాతరోజు డబ్బులు ఇస్తానని హామీ ఇవ్వడం, రెండు రోజులుగా షాపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన ఫైనాన్సర్లు శుక్రవారం హోటల్ తలుపు తీయగా లోపల మొత్తం ఖాళీగా కనిపించింది. దీంతో ఫైనాన్సర్లు, చికెన్, కిరాణ సామగ్రి సప్లయర్స్ పోలీసుస్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. రాజేష్‌సింగ్ సుమారు రూ.30 లక్షల వరకు అప్పుపెట్టినట్లు సమాచారం.
● కుటుంబ కలహాలే కారణం
● నివాళులర్పించిన పార్టీ శ్రేణులు
రూ.30 లక్షల వరకు ఎగనామం
లబోదిబోమంటున్న ఫైనాన్సర్లు


