● గత ఏడాది కంటే రూ.20 కోట్ల పెంపు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీకి (2026–2027)బ్లాక్‌గ్రాంట్ గత ఆర్థిక సంవత్సరం కంటే సుమారు రూ.20 కోట్ల వరకు పెరిగింది. కాకతీయ యూనివర్సిటీలోని టీచింగ్, నాన్‌టీచింగ్ ఉద్యోగులకు, కాంట్రాక్టు, చౌట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కలిపి వేతనాల పద్దుకింద మొత్తంగా రూ. 165,47,33,000ను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం బడ్జెట్‌లో కేటాయించింది. ఇందులో గ్రాంట్ ఇన్‌ఎయిడ్ వేతనాల కింద రూ.129,83,31,000 కేటాయించగా, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల కోసం గ్రాంట్ రూ.35,64,02,000 కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరం 2025–2026 బడ్జెట్‌లో బ్లాక్‌గ్రాంటు రూ.145,62,71,000 కేటాయించింది. కాగా, యూనివర్సిటీ అధికారులు ప్రతిపాదించిన మేర నిధులు కేటాయించలేదని సమాచారం. అయినా గతంకంటే రూ.20 కోట్ల వరకు పెరుగుదలపై కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం సంతృప్తి వ్యక్తం చేశారు.


