గూడూరు: మానుకోట జిల్లా గూడూరు మండలంలోని మచ్చర్ల శివారు తార్యతండాకు చెందిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్‌నాయక్ తండ్రి లచ్చనాయక్ సోమవారం రాత్రి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్‌సింగ్ ఆర్య శుక్రవారం రాత్రి హుస్సేన్‌నాయక్ కుటుంబాన్ని పరామర్శించారు. లచ్చనాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదే విధంగా బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ మాలోతు కవిత, ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి దళిత రత్న కొండ్ర ఎల్ల య్య, జిల్లా అధ్యక్షుడు బోడ ఎల్లయ్య, టీజీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయీ స్ విక్టిమ్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ దగ్గు రాజేందర్, కేసముద్రం మున్సిపల్ చైర్మన్ బానోతు సునీత వెంకన్ననాయక్, గోపా డివిజన్ అధ్యక్షుడు చిలువేరు సమ్మయ్యగౌడ్, పురుషోత్తం తదితరులు నివాళులర్పించినవారిలో ఉన్నారు.


